
యాదాద్రి, ఆగస్టు12: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సాగర్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన భగత్‌తో గురువారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, గుర్తింపు కార్డును అందజేశారు. ఈ సందర్భంగా భగత్‌కు ప్రభుత్వ విప్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆశయాలకు అనుగుణంగా నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
పతాకావిష్కరణ చేయనున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
ఆలేరు రూరల్, ఆగస్టు12: రాష్ట్రానికే కొలనుపాక రైతులు దిక్సూచిగా నిలవాలని ప్రభుత్వ విప్ గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. కేవలం కొలనుపాక గ్రామానికి రూ. 3.67కోట్ల రైతుబంధును సీఎం కేసీఆర్ ప్రభు త్వం అందజేస్తున్నదని గుర్తుచేశారు. గురువారం ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో సోమేశ్వరస్వామి రైతుసంఘం నూతన భవనాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సోమేశ్వరస్వా మి రైతుసంఘం జిల్లాలోనే ఆదర్శ రైతుసంఘం గా ఎదగాలన్నారు. కొలనుపాకకు చెందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. త్వరలోనే మల్లన్న సాగర్ ద్వారా గంధమల్ల రిజర్వాయర్‌ను నింపి ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. రైతులు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయాలని, వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని వారు అన్నారు. రైతే రాజు అనే నినాదంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నారన్నారు. పాడి పరిశ్రమలో ఆలేరు నియోజకవర్గం ముందుందని వారు గుర్తుచేశారు. 16లక్షల50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ముందు ఉన్నదన్నారు. దండుగ అన్న వ్యవసాయాన్ని పం డుగల మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం గ్రామంలో నాబార్డ్ నిధులతో ఏర్పాటు చేసిన సంతను వారు పరిశీలించా రు. సోమేశ్వరస్వామి రైతుసంఘం ఆధ్వర్యంలో గొంగిడి దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, సోమేశ్వరస్వామి రైతుసంఘం అధ్యక్షుడు బెదరబొయిన సిద్ధిరాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్‌గౌడ్, నాబార్డ్ ఏజీఎం వినయ్‌కుమార్, ఏడీఏ వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ కుడుదుల నగేశ్, మదర్ డెయిరీ డైరెక్టర్ దొం తిరి సోమిరెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షు డు జి.శ్రీనివాస్, మల్లేశ్‌గౌడ్, మామిడాల నర్సింహులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొటగిరి పాండరి, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు బైరి రమేశ్‌గౌడ్, సోమేశ్వరస్వామి రైతుసంఘం సభ్యులు గాదె సోమిరెడ్డి, చామల మాధవరెడ్డి, శంకర్, కుమ్మరిండ్ల బాల్‌నర్సయ్య, బొమ్మెన ఉప్పలయ్య, కొండల్, గడ్డమీది రాజుగౌడ్, రామ్మోహన్, నంద మహేందర్, రాజయ్య, బెల్లం కొండ వేణుగోపాల్, రైతులు తదితరులున్నారు.
యాదాద్రి, ఆగస్ట్టు12: పంద్రాగస్టును పురస్కరించుకుని ఆగస్టు 15న జాతీయ పతాకావిష్కరణకు ముఖ్యఅతిథులను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగే పంద్రాగస్టు వేడుకలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆమె పోలీసుల గౌర వ వందనాన్ని స్వీకరిస్తారు.