
బీబీనగర్, సెప్టెంబర్ 11 : మండలంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక జోరుగా కొనసాగుతున్నది. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోరుకంటి బాలచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో బట్టుగూడెం గ్రామ అధ్యక్షుడిగా గంగదేవి రాములు, ఉపాధ్యక్షుడిగా ఆడపల్లి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా ముక్కెర మహేందర్, మఖ్దుంపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎరసాని వెంకటనరసింహ, ప్రధాన కార్యదర్శిగా మట్ట గోపికృష్ణ, మాదారం జ్యోతుల శంకరయ్య, తంతరపల్లి బాలయ్య, జైనపల్లి అధ్యక్షుడిగా సోము శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తంతరపల్లి మహేశ్, వెంకిర్యాల అధ్యక్షుడిగా డబ్బీకార్ రాజేశ్వర్, కార్యదర్శిగా మంద రమేశ్, నెమరగోముల అధ్యక్షుడిగా పాలకూర జంగయ్య, కార్యదర్శిగా సంకూరి మహిపాల్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌డ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భువనగిరిలో..
భువనగిరి అర్బన్ : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీలా ఓంప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో పలు గ్రామ శాఖల కార్యవర్గాలను ఎన్నుకున్నారు. వీరవెల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా రేపాక యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా దయ్యాల మహేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా రేగు మహేశ్, బీసీ సెల్ అధ్యక్షుడిగా తోటకూరి రవీందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నల్ల మహేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా నల్లమాసు పారిజాత, చీమలకొండూరు అధ్యక్షుడిగా పల్లెర్ల జహంగీర్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కంచి మల్లయ్య, వీరవెల్లి ఎంపీటీసీ కంచి లలితామల్లయ్య, చందుపట్ల పీఏసీఎస్ డైరెక్టర్ తోటకూరి శంకరయ్య, చింతల వెంకట్‌రెడ్డి మాజీ ఎంపీటీసీ చింతల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రేగు వెంకటేశ్ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి వార్డు కమిటీలు
భూదాన్ పోచంపల్లి : మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డు కమిటీలను మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సీత వెంకటేశం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రెండో వార్డు అధ్యక్షుడిగా ఏనుగు యాదిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొండమడుగు శివరాజ్, 9వ వార్డు అధ్యక్షుడిగా దేవరకొండ ఆనంద్‌చారి, ప్రధాన కార్యదర్శిగా సిద్ధుల ప్రభాకర్, 11వ వార్డు అధ్యక్షుడిగా గుండ్ల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కుడికాల భానును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గుణిగంటి మల్లేశం గౌడ్, సీత శ్రవణ్‌కుమార్, దొడ్డమోని చంద్రం యాదవ్, మునికుంట్ల బాలచంద్రంగౌడ్, సిద్ధగోని రాజమల్లేశ్, ఏనుగు వెంకట్‌రెడ్డి, కొండమడుగు రామేశ్వర్, పెద్దల శేఖర్, బోడ దయానంద్, భారత బాలశంకర్ పాల్గొన్నారు.