మాల్, ఫిబ్రవరి 9 : చింతపల్లి మండల పరిధిలోని ఉమ్మంతలపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ తాగాదాలతో శిరీష అనే మహిళ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ మంటలు పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలకు అంటుకోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.