Parliament: ఇరాన్ వార్ వల్ల 26 వేల విమానాలకు అంతరాయం.. పార్లమెంట్లో కేంద్రం ప్రకటన
Parliament: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వల్ల భారతీయ అంతర్జాతీయ విమానరంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ వార్ వల్ల భారత విమాన సంస్థలకు చెందిన సుమారు 26 వేల విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని పార్లమెంట్లో ఇవాళ కేంద్రం వెల్లడించింది.
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతీయ అంతర్జాతీయ వైమానిక రంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ వార్ వల్ల భారతీయ వైమానిక సంస్థలకు చెందిన సుమారు 26 వేల విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల ఊహించని రీతిలో ఆదాయం నష్టపోయినట్లు ఇవాళ పార్లమెంట్(Parliament)లో ప్రభుత్వం పేర్కొన్నది. జూలై 20వ తేదీ నాటికి దాదాపు 26 వేల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రభుత్వం చెప్పింది. విమానాల దారిమళ్లింపు వల్ల నష్టం మరింత పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభ ఎంపీ ఆంటో ఆంటోనీ వేసిన ప్రశ్నకు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురలీధర్ మోహల్ సమాధానం ఇచ్చారు.
విమానాలపై ఆంక్షల వల్ల ఎక్కువ శాతం విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్నింటిని దారిమళ్లించారని, కొన్ని విమానాశ్రయాల్లో ఆలస్యం జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే ఏ విమాన సంస్థకు, ఏ విమానాశ్రయానికి ఎంత నష్టం వచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. విమానశాఖపై ఇరాన్ యుద్ధం ప్రభావం పడకుండా ఉండేందుకు .. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సుమారు 10వేల కోట్ల బడ్జెట్‌ను మద్దతుగా అందజేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

