అమరావతి : వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu) ను రాజమండ్రి జైలు ( Jail ) నుంచి గుంటూరుకు తరలించారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు.
ఈ కేసుతో పాటు తిరుమల లడ్డూ వ్యవహారంలో నిర్వహించిన నిరసనలో సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై టీడీపీ నాయకులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కూడా గుంటూరు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు తీసుకువచ్చారు. అంబటి రాంబాబు వేసిన బెయిల్ పిటిషన్పైతో పాటు జైలులో అదనపు సౌకర్యాలకు కల్పించాలని రాంబాబు వేసిన పిటిషన్పై సోమవారం విచారణ కొనసాగనుంది.