
మోటకొండూర్, ఆగస్టు 11: జీవాలకు ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందులను గొర్రెలకు, మేకలకు వేయించి పశు సంపదను కాపాడాలని జిల్లా పశువైద్యాధికారి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని నాంచారిపేట గ్రామంలో సర్పంచ్ పైళ్ల వినోదాసుధాకర్రెడ్డితో కలిసి జీవాలకు నట్టల నివారణ మందులను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవాలకు నట్టల నివారణ మందులను వేసి సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మహేందర్, ఉప సర్పంచ్ కప్పె మల్లేశం, కురుమ సంఘం అధ్యక్షుడు కానుగంటి శ్రీశై లం, వార్డు సభ్యులు పోతగాని స్వప్న, రైతులు యాదయ్య, అయిలయ్య, నాగమల్లయ్య, జంగయ్య పాల్గొన్నారు.
ఆలేరురూరల్, ఆగస్టు11: మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో సర్పంచ్ వడ్ల నవ్య శోభన్‌బాబు జీవాలకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి పి. శ్రీనివాస్, గొర్రెకాపారులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం,ఆగస్టు11: మండలంలోని మేడిపల్లి,తిమ్మాపూర్,తిరుమలగిరి,కాండ్లకుంట గ్రామాల్లో మేడిపల్లి సర్పంచ్ సుర్వి గోవింద్ గౌడ్ మండల పశువైద్యాధికారి సునీత అధ్వర్యంలో నట్టల నివారణ మందు వేశారు. సర్పంచులు ఎన్.అశోక్ నాయక్,హర్యానాయక్,పశువైద్య పాల్గొన్నారు.
గుండాల, ఆగస్టు 11: మండలంలోని రామారం, అంబాల గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాలకు సర్పం చులు బబ్బూరి గాయత్రిసుధాకర్, యాస బాషిరెడ్డి నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారులు డాక్టర్లు గోపీకృష్ణ, యాకూబ్ పాల్గొన్నారు.