కారేపల్లి ఎంపీఓకు జీపీ కార్మికుల సమ్మె నోటీసు
కార్మిక చట్టాల స్ధానంలో లేబర్ కోడ్లు తెచ్చి శ్రామికుల శ్రమను దోచుకునేందుకు హక్కులు కల్పించడాన్ని నిరసిస్తూ, అలాగే గ్రామ పంచాయతీ వర్కర్లకు గ్రీన్ చానల్ ద్వారా జీతాలు ఇవ్వాలని, జీపీ సిబ్బందిని 2వ పీఆర్సీ పరిధిలోని తీసుకురావాలని
కారేపల్లి, ఫిబ్రవరి 10 : కార్మిక చట్టాల స్ధానంలో లేబర్ కోడ్లు తెచ్చి శ్రామికుల శ్రమను దోచుకునేందుకు హక్కులు కల్పించడాన్ని నిరసిస్తూ, అలాగే గ్రామ పంచాయతీ వర్కర్లకు గ్రీన్ చానల్ ద్వారా జీతాలు ఇవ్వాలని, జీపీ సిబ్బందిని 2వ పీఆర్సీ పరిధిలోని తీసుకురావాలని, జీఓ నం.51 సవరించి పల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌తో ఈ నెల 12న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు సింగరేణి మండల జీపీ కార్మికులు సోమవారం ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కే.నరేంద్ర మాట్లాడుతూ జీపీ కార్మికులకు ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్య కల్పించాలని డిమాండ్ చేశారు.
జీపీ కార్మికులతో పాలకులు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని కసీన వేతనం రూ.26 వేలు చేయాలన్నారు. పాలకుల చర్యలపై ప్రతిఘటనతో దారికొస్తారన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీపీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి శాదరాసిపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బోళ్ల కొమరయ్య, సహాయ కార్యదర్శి ఆదెర్ల గౌతమ్, కోశాధికారి శ్రీను, నాయకులు ఆదార్ల శ్రీను, తిరపయ్య, యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

