
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్
జిల్లా వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీ
యాదాద్రి, సెప్టెంబర్ 9 : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 11వ వార్డులో గురువారం వాసవీ క్లబ్, శ్రీశాంకరి డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధామహేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ తాళ్లపల్లి నాగరాజు, శ్రీశాంకరి డెవలపర్స్ ప్రతినిధులు శ్రీరామ్మూర్తి గౌడ్ పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో కలెక్టర్ పమేలాసత్పతి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌తివారీ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలో జడ్పీటీసీ కె.నరేందర్‌గుప్తా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఎంపీఓ పద్మావతి, సర్పంచ్ నగేశ్, వైస్ ఎంపీపీ పద్మ, ఎంపీటీసీ కవిత పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : పట్టణంలోని 17వ వార్డుకు చెందిన చెన్న స్వాతీమహేశ్ సహకారంతో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమలను భువనగిరి ఏసీపీ ఎస్.వెంకట్‌రెడ్డి పంపిణీ చేశారు. కెనరా బ్యాంకు సమీపంలో వాసవీక్లబ్ సహకారంతో అందజేసిన మట్టి వినాయక ప్రతిమలను మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య పంపిణీ చేశారు.
చౌటుప్పల్ : మున్సిపాలిటీ కేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమలను మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు ఉప్పు ఆంజ నేయులు, సెక్రటరీ కాసుల వెంకటేశం, ప్రకాశ్‌గుప్తా, ప్రశాంత్, కరుణాకర్ పాల్గొన్నారు.
రామన్నపేట : మండలంలోని పల్లివాడ గ్రామంలో మటి ్టవినాయక విగ్రహాలను గ్రామసర్పంచ్ కడమంచి సంధ్యాస్వామి పంపిణీ చేశారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండలం మాసాయిపేటలో మట్టి వినాయక విగ్రహాలను అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పంపిణీ చేశారు. అనంతరం కేఎస్ఆర్ ఇన్ప్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ అందించారు. డీపీఓ సాయిబాబా, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనురాధ పాల్గొన్నారు.
వలిగొండలో..
వలిగొండ : ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గజ్జెల అమరేందర్ సౌజన్యంతో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. మండల ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు బచ్చు శ్రీనివాస్, పోలేపాక రమేశ్ పాల్గొన్నారు.