
హరితహారం లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రం
అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్రం హరితహారంలో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుందని అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి అన్నారు. జిల్లాలోని రాయగిరి సమీపంలో గల ఆంజనేయ అభయారణ్యంలో డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ వదిలే కార్యక్రామాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలోని అటవీ, ఇతర ప్రాంతాల్లో 230 కోట్ల మొక్కలను ఏడు సంవత్సరాల్లో నాటాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ సంవత్సరంతో 234 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని చేరుకున్నదని తెలిపారు. లక్ష్యాన్ని చేరుకోవడంతో రాష్ట్రంలో 5శాతం గ్రీన్‌కవర్ అభివృద్ధి చెందిందన్నారు. మొక్కలు నాటేందుకు వీలులేని పెద్ద పెద్ద కొండలు, గుట్టలపైన, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్‌ను వెదజల్లే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సీడ్ బాల్స్ మొలకెత్తాయో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ ద్యారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. 2030 వరకు సీడ్‌బాల్స్‌ను డ్రోన్ ద్వారా వెదజల్లి ఒక బిలియన్ మొక్కలు నాటాలనే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని, ఈ సంవత్సరం 50 లక్షల సీడ్‌బాల్స్ వేయనున్నామని తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, అటవీ అధికారులు ఎండీ అక్బర్, డీఎఫ్ఓ డీవీ రెడ్డి, వైటీడీఏ ఎఫ్ఆర్ఓ రవికుమార్, డీఆర్ఓ గురుప్రసాద్ పాల్గొన్నారు.
టెక్స్టైల్ పార్కు సందర్శన
చౌటుప్పల్ రూరల్ : మండల పరిధిలోని దండు మల్కాపురం టెక్స్టైల్ పార్కును బుధవారం సీఎంఓ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి సందర్శించారు. పార్కులో ఉన్న మొక్కలను పరిశీలించి అక్కడ మొక్కను నాటారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. డీఆర్డీఓ పీడీ ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ రాకేశ్‌రావు, సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
పల్లెప్రకృతి వనాల పరిశీలన
భువనగిరి అర్బన్ : మండలంలోని తుక్కాపూర్, హన్మాపురం గ్రామాల్లో హరితహారం మొక్కలు, పల్లెప్రకృతి వనం, ఎవెన్యూ ప్లాంటేషన్, ఉపాధి హామీ పనులను అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి పరిశీలించారు. ఎంపీడీఓ నాగిరెడ్డి, సర్పంచులు ఎడ్ల రాజిరెడ్డి, నోముల పద్మామహేందర్రెడ్డి, ఏపీఓ బాలస్వామి, ఎంపీఓ అనురాధ, టీఏ నాగరాజు, రామచంద్రయ్య పాల్గొన్నారు.