
సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలోని కడపగండితండాకు చెందిన ముడావత్ సక్రు-పద్మ దంపతులు కూలిపనులు చేస్తూ బతికేవాళ్లు. వీరికి కూతురు అఖిల(7), కుమారులు శరత్(11), సంతోష్ (5) ఉన్నారు. నాలుగేండ్ల క్రితం పద్మ ఇంట్లో వాటర్ ట్యాంకులో పడి చనిపోగా సక్రు రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో మృతి చెందాడు. దీంతో ముగ్గురు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. పెంచి పోషిం చే స్థోమత లేకపోయినా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులకు వృద్ధాప్యంలో ఉన్న నాయనమ్మ ముడావత్ లక్ష్మి దిక్కైంది. తనకు నెల నెలా వచ్చే వితంతు పింఛన్ డబ్బులు, రేషన్ బియ్యంతోనే చిన్నారులను పోషిస్తున్నది. పట్టెడు అన్నం కూడా కష్టంగా మారిందని మనసున్న మహరాజులు సాయం చేయాలని ముగ్గురు గిరిజన బిడ్డలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
-సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 8
‘అమ్మ ప్రతిరోజు రెడీ చేసి జడలు వేసి స్కూలుకు పంపేది.. నాన్న బండి మీది తీసుకుపోయి షాపులో మేము ఏది అడిగినా కొనిచ్చే వాడు.. ఇప్పుడు అమ్మానాన్న చనిపోవడంతో ఎవరిని అడగాలో అర్థంకావడంలేదు.. అమ్మానాన్నలు లేకుండా ఉండలేకపోతున్నాం. అమ్మానాన్న రోజు గుర్తుకు వస్తున్నారు నిద్ర వస్తలేదు సార్.. అమ్మ ఫొటో పక్కన పెట్టుకొని పడుకుంటున్నాం’ అంటూ ముగ్గురు చిన్నారులు బోరునా విలపిస్తున్నారు. కడుపు నిండ అన్నం కూడా తినలేకపోతున్నాం, పూటగడవడం కష్టంగా మారింది. నాయనమ్మకు వచ్చే పింఛన్ డబ్బులతోనే బతుకుతున్నాం. నాయనమ్మ పస్తులు ఉండి మాకు అన్నం పెడుతుంది. పట్టెడు అన్నం కూడా కష్టంగా మారిందని, మనసున్న మహరాజులు ఎవరైనా సాయం చెయ్యకపోతారా అని ముగ్గు రు గిరిజన బిడ్డలు ఆశగా ఎదురు చూస్తున్నారు. – సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 8
సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలోని కడపగండితండాకు చెందిన ముడావత్ సక్రు-పద్మ దంపతులు కూలీ పనులు చేస్తూ బతికేవాళ్లు. వీరికి కూతురు అఖిల(7), కుమారులు శరత్(11), సంతోష్(5) ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాలుగేండ్ల కిందట పద్మ ఇంట్లో వాటర్ ట్యాంక్‌లో పడి చనిపోగా, సక్రు రెండేండ్ల కిందట యాక్సిడెంట్లో మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. పెంచి పోషించే స్థోమత లేకపోయినా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులకు వృద్ధాప్యంలో ఉన్న నాయనమ్మ ముడావత్ లక్ష్మి దిక్కు అయ్యింది. ‘తనకు నెలనెలా వచ్చే వితంతువు పింఛన్ డబ్బులు, రేషన్ బియ్యంతోనే చిన్నారులను పోషిస్తుంది. నేను ఒక్క పూట పస్తులుండి పిల్లలకు తినిపిస్తున్న.. పిల్లలు ఏమైనా అడిగినా ఇప్పించే పరిస్థితి లేదు.
రోజు పిల్లలు అమ్మ, నాన్న కావాలని ఏడుస్తున్నారు. పిల్లలకు సరిగ్గా రెండు పూటల అన్నం కూడా పెట్టకుండా అయిపోయిందని.. నాకు ఆరోగ్యం బాగుండటం లేదు.. నేను చచ్చిపోతే పిల్లలు ఆగమైపోతారు సారూ అంటూ కన్నీటిపర్యంతమవుతుంది ఆ చిన్నారుల నాయనమ్మ ముడావత్ లక్ష్మి. ఎవరైనా దాతలు సహకరించి ఆదుకోవాలని, పిల్లలకు
పట్టెడు అన్నం పెట్టించండి సారు జీవితాంతం రుణపడి ఉంటామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
నా కొడుకు, కోడలు ఇద్దరూ సచ్చిపోయిర్రు సారు. ముగ్గురు పిల్లలకు ఎవరు దిక్కులేరు.. నీనే చూసుకుంటున్నా. నా ఆరోగ్యం కూడా బాగ లేదు. పింఛన్ పైసలతోనే కాలం వెల్లదీస్తున్న. పిల్లలకు రెండు పూటల అన్నం పెట్టడం కష్టమవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు కొడుకుకు అప్పు చేసి దవాఖానలో చూపించిన. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్లు అడుగుతున్నారు. ఈ బాధలన్నీ భరించలేకపోతున్నా చచ్చిపోవాలని పిస్తుంది. పిల్లల కోసమే బతుకుతున్నా. ఎవరైనా సాయం చేయండి సారు.