
యాదాద్రి, సెప్టెంబర్ 4 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న వారితో పాటు నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామి వారి దర్శనానికి బారులుదీరారు. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో రద్దీ పెరిగింది. బాలాలయంలో నిత్యపూజలు సందడి నెలకొంది. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ ఆర్చన వరకు నిత్యపూజలు జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీ నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజ లు చేశారు. బాలాలయం ముఖ మండపంలో నిత్య కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేశారు.
శ్రీవారి ఖజానాకు రూ.20,72,602ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.20,72,602 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.3,82,172, రూ.100 దర్శనంతో రూ. 46,500, వీఐపీ దర్శనం ద్వారా రూ. 3,00,000, నిత్య కైంకర్యాలతో రూ.1,000, సుప్రభాతం ద్వారా రూ. 2,400, క్యారీ బ్యాగులతో రూ. 6,300, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 2,17,500, కల్యాణకట్టతో రూ. 47,200, ప్రసాద విక్రయంతో రూ. 6,82,950, శాశ్వతపూజల ద్వారా రూ. 35,580, వాహన పూజలతో రూ. 14,100, టోల్గేట్తో రూ. 1,700, అన్నదాన విరాళంతో రూ.46,961, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,39,144, యాదరుషి నిలయంతో రూ.75,230, పాతగుట్ట నుంచి రూ.73,865తో కలుపుకొని రూ. 20,72,602 ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు.