
ఉత్సాహంగా టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్ గ్రామ కమిటీల జోరుగా సాగుతున్నాయి. మంగళవారం పలు గ్రామాల్లో గ్రామ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు సమావేశమై పార్టీ కార్యవర్గం, అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భువనగిరి మండలంలోని మన్నెవారిపంపు గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎంపల్ల దేవేందర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా బోయిని గండయ్య, ఉపాధ్యక్షుడిగా బి.పరమేశ్, ప్రధాన కార్యదర్శిగా గంగదేవి వెంకటేశ్, కోశాధికారిగా అంకర్ల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా బోయిని నర్సింహ (చిన్న), అనుబంధ కమిటీలను ఎన్నుకున్నారు. తాజ్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ర్యాకెల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కోట గోవర్ధన్, దేవునూరి బాలయ్య, ప్రధాన కార్యదర్శిగా బొమ్మారపు కొండల్, సంయుక్త కార్యదర్శిగా పల్లెపాటి రామస్వామి, కోశాధికారిగా గుల్లపల్లి ప్రవీణ్ ఎన్నికయ్యారు. ముస్త్యాలపల్లి అధ్యక్షుడిగా పాల మహేశ్, ఉపాధ్యక్షుడిగా గంటపాక నరేశ్, ప్రధాన కార్యదర్శిగా బిజిని శేఖర్, సంయుక్త కార్యదర్శిగా పసునాది పరమేశ్, కోశాధికారిగా రావుల నరేశ్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
రామన్నపేట
రామన్నపేట : బోగారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా అంతటి రమేశ్, ఉపాధ్యక్షుడిగా మేడి మల్లేశ్, కార్యదర్శిగా మద్దెపూరి పద్మయ్య నీర్నెంల అధ్యక్షుడిగా బొల్లం సతీశ్, ఉపాధ్యక్షుడిగా రాంరెడ్డి, కార్యదర్శిగా నాగటి యాదయ్య, సిరిపురం అధ్యక్షుడిగా బండా శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మోటె మల్లేశం, కార్యదర్శిగా గాదె శంకరయ్య, నిదానపల్లి అధ్యక్షుడిగా వర్కాల మొగులయ్య, ఉపాధ్యక్షుడిగా కొడతం నాగభూషణం, కార్యదర్శిగా కొండ మల్లయ్య ఎన్నికయ్యారు.
బీబీనగర్
బీబీనగర్ : మండలంలోని కొండమడుగు గ్రామ శాఖ అధ్యక్షుడిగా బత్తుల శ్రీనివాస్‌గౌడ్, గూడూరు-పోనుగంటి నర్సింహాచారి, లక్ష్మీదేవిగూడెం-జిల్కపల్లి బాలరాజును ఎన్నుకున్నారు. కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, నాయకులు చింతల సుదర్శన్‌రెడ్డి, రాజశేఖర్ గౌడ్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
మోత్కూరు మండలంలో..
మోత్కూరు : మున్సిపాలిటీలోని 9వ వార్డు అధ్యక్షుడిగా కల్వల రాము, ఉపాధ్యక్షుడిగా మర్రి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా పురుగుల రమేశ్, సంయుక్త కార్యదర్శిగా జినుకల యాకయ్య, కోశాధికారిగా బీసు సత్తయ్యతోపాటు అనుబంధ కమిటీలను ఎన్నుకున్నారు. మండలంలోని దత్తప్పగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండి వెంకటేశ్, ఉపాధ్యక్షుడిగా అశ్రఫ్ జానీ, ప్రధాన కార్యదర్శిగా గనగాని రమేశ్, కోశాధికారిగా కట్కూరి అంజిరెడ్డి ఎన్నికయ్యారు.
అడ్డగూడూరు మండలంలో..
అడ్డగూడూరు : మండలంలోని లక్ష్మీదేవికాల్వ, ధర్మారం, గట్టుసింగారం గ్రామ కమిటీలను ఎన్నికల పరిశీలకులు, ఎంపీపీ దర్శనాల అంజయ్య, సింగిల్‌విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్ష్మీదేవికాల్వ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మారోజు వెంకన్న, ఉపాధ్యక్షులుగా చింత పరశురాములు, కన్నెబోయిన గంగులు, ప్రధాన కార్యదర్శిగా చిగుళ్ల గంగరాజు, కార్యదర్శిగా కంచుగట్ల నాగయ్య, కోశాధికారిగా పాక మల్లయ్య, ధర్మారం అధ్యక్షుడిగా కత్తుల నరేశ్, ఉపాధ్యక్షులుగా మందుల నర్సింహ, బాల్నె వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా మందుల జానీ, కార్యదర్శిగా కప్పల యాదయ్య, కోశాధికారిగా రెడ్డిమల్ల యాదయ్య ఎన్నికయ్యారు. గట్టుసింగారం అధ్యక్షుడిగా పొన్నాల నవీన్‌కుమార్, ఉపాధ్యక్షులుగా పిట్టల సైదులు, నల్లబెల్లి మురళి, ప్రధాన కార్యదర్శిగా పనుమటి ప్రభుదాస్, సహాయ కార్యదర్శిగా ముప్పడి సైదులు, కోశాధికారిగా ఈదుల నరేశ్‌ను ఎన్నుకున్నారు.
వలిగొండ
వలిగొండ : అరూరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొడితాల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా మోదల వెంకటేశం, జంగారెడ్డిపల్లి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శివరాత్రి శ్రీనివాస్, శివరాత్రి వేణు, మాందాపురం- కౌకుంట్ల సోమిరెడ్డి, దేశపాక మహేశ్, ఎదుళ్లగూడెం-కొంతం శ్రీను, గుమ్మడి జనార్దన్‌రెడ్డి, నర్సయ్యగూడెం-మాదాను జాన్ భాస్కర్, వేల్పుల ఆంజనేయులు ఎన్నికయ్యారు.
భూదాన్‌పోచంపల్లి మండలంలో.. భూదాన్
పోచంపల్లి : దోతిగూడెం అధ్యక్షుడిగా ముద్ద శ్రీశైలం, అంతమ్మగూడెం-వస్పరి లింగయ్య, ధర్మారెడ్డిపల్లి-కాసుల చిన్న సత్తయ్యగౌడ్, వంకమామిడి-బొడిగె మల్లయ్య గౌడ్, భీవనపల్లి- బూర్గు బాలకృష్ణ గౌడ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.