
కలెక్టర్ పమేలాసత్పతి
తుర్కపల్లి, ఆగస్టు18: దళితబంధు పథకం కింద మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియో గం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ దీపక్‌తివారీతో కలిసి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితబంధు నిధుల వినియోగంపై దళితులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల4వ తేదీన సీఎం కేసీఆర్ గ్రామాన్ని సందర్శించి దళితవాడల్లో కాలినడకన కలియతిరిగి దళితుల ఆర్థిక స్థితిగతులను స్వయంగా తెలుసుకోవడంతోపాటు గ్రామంలోని 76 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున రూ.7.60 కోట్ల నిధు లను మంజూరు చేశారని ఆమె తెలిపారు. గత 10 రోజులుగా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు దళితవాడల్లో ఇంటింటికీ తిరిగి తయారు చేసిన నివేదికలను చూశామని, ఆ నివేదికలే ఫైనల్ కాదని లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో చర్చించి మంచి యూనిట్లను ఎంపిక చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు యూనిట్లను గ్రామంలోనే ఏర్పాటు చేసు కోవాలనే నిబంధనేమి లేదని, నచ్చిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చని ఆమె సూచించారు. దళిత కుటుంబాల్లోని చదువుకున్న యువత ఆయా కుటుంబాలతో చర్చించి లాభాలు అధికంగా ఉండే యూనిట్లు పెట్టుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అందించిన నివేదికల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఒకే రకమైన యూనిట్లను ఏర్పాటు చేసు కునేందుకు మొగ్గుచూపారని, అలా చేయడం వల్ల సరుకులు అమ్ముడుపోక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని, అలా కాకుండా అనుభవం ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఎదగాలన్నారు. లబ్ధిదారు లు విడివిడిగా యూనిట్లు పెట్టుకోవడంతో పాటు ముగ్గురు, నలుగురు కలిసి ఒక పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే సమ ష్టి కృషితో ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు.
స్వయంగా తామే ఇంటింటికీ తిరిగి ఆసక్తి, నైపు ణ్యం ఉన్న రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరి ఒత్తిడికి లొంగకుండా ఫుడ్ ప్రాసెసింగ్ తదితర లాభాలు చేకూర్చే పథకాలపై ఆసక్తి చూపాలన్నా రు. ప్రభుత్వం నేరుగా దళితుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం గొప్ప విషయమని ఒక్కొక్కరూ రెండు లేదా మూడు పథకాలను ఎం పిక చేసుకోవచ్చని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయు లు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో ఉమాదేవి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
చర్యలను వేగవంతం చేయాలి
భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు18: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపురం లో సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీఎన్‌తిమ్మాపురం గ్రామస్తులు, అధికారులతో ఆమె సమావేశమై భూసేకరణ, పరిహారం చెల్లింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రా మం కావడంతో స్వయంగా సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకుని, సహాయక చర్యలు చేపడుతామన్నారు. గ్రామంలో 37మంది రైతు లు మరణించారని,ఆ రైతుల కుటుంబాలు రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను కోల్పోతున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్తగా నిర్మించుకున్న 72 ఇండ్లకు కూడా పునరావాస ప్యాకేజీని అమ లు చేయాలని, అదేవిధంగా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను పునరుద్ధ్దరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలోని 104 ఎకరాల భూమికి వారసులు గ్రామంలో లేకపోవడంతో కబ్జాలో ఉన్న వారికి పట్టాలు జారీచేసి భూసేకరణ జరిపి పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. పునరావాస చర్యల కింద వెంటనే అభివృద్ధి చేపట్టి లేఅవుట్ రూపొందించాలని, ప్లాట్లు చేసి శంకుస్థాపన చేసి పునరావాస ప్యాకేజీని అమలు చేయాల ని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, ఇన్చార్జి కలెక్టర్ భూపాల్‌రెడ్డి, ఆర్డీ వో సూరజ్‌కుమార్, తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఇంజినీర్లు, భూసేకరణ అధికారు లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.