Speaker Om Birla: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు
Speaker Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశాయి. కాంగ్రెస్ ఎంపీ, చీఫ్ విప్ కే సురేశ్.. లోక్‌సభ సెక్రటేరియేట్‌కు తమ నోటీసును అందజేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే పార్టీల తరపున ఆ నోటీసును సెక్రటేరియేట్‌కు సమర్పించారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla)పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష ఎంపీలకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. 8 మంది ఎంపీల సస్పెన్షన్‌ను కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, చీఫ్ విప్ కే సురేశ్.. లోక్‌సభ సెక్రటేరియేట్‌కు తమ నోటీసును అందజేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే పార్టీల తరపున ఆ నోటీసును సెక్రటేరియేట్‌కు సమర్పించారు.
అయితే అవిశ్వాస తీర్మానం నోటీసుపై మాత్రం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సంతకం చేయలేదు. ఆ చర్యలో తాము భాగస్వామ్యం కాదన్నారు. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోంది. దీంతో అప్పటి నుంచి సరైన రీతిలో లోక్‌సభ వ్యవహారాలు సాగడంలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

