అత్తాపూర్ : హైదర్‌గూడ మూసీ వద్ద ఉ్న స్మశానవాటికను దశల వారిగా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ అధికారులలో కలిసి స్మశానవాటికను పరీశీలించారు. గత వారం హైదర్‌గూడ గ్రామస్తులు ఎమ్మెల్యేని కలిసి స్మవానవాటికను అభివృద్ధి చేయాలని వినతిపత్రం సమర్పించారు.
ఇందుకు స్పందించిన ఆయన సోమవారం అధికారులతో కలిసి పర్యటించి అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు పలు విషయాలను ఎమ్మెల్యేదృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో ఉన్న అన్ని స్మవానవాటికలను అభివృద్ధి చేశామని అదే రీతిలో హైదర్‌గూడలో అభివృద్ధి చేస్తాం అన్నారు.
దశల వారిగా నిధులను తీసుకువచ్చి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మంగళవారం రెవెన్యూశాఖ అధికారులతో చర్చించి ముందుగా స్మవానవాటికకు కంపౌండ్వాల్ను నిర్మించనున్నట్లు వివరించారు. మరొక బర్నింగ్ యార్డు, కూర్చోడానికి షెడ్డు, ఇతర అవరా లకోసం గదులను నిర్మిస్తాం అన్నారు.
ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్తుంలందరూ కలిసి నిర్ణయించినట్లుగానే అభివృద్ది చేస్తాం అని తెలిపారు. నిధుల కొరత ఏర్పడితే తన సొంత నిధులతో పనులు చేయిస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు అర్చన. సంగీతలతో పాటు, రాజేంద్రనగర్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ కనకయ్య, అన్ని పార్టీలకు చెందిన నాయకులు. యువజనసంఘాల సభ్యులు పాల్గోన్నారు.