ఈ నెల 12న నగరానికి మంత్రి కేటీఆర్
రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్న అధికారులు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన చీఫ్‌విప్ దాస్యం, ఎమ్మెల్యే నన్నపునేని, అర్బన్ కలెక్టర్, కమిషనర్
హన్మకొండ, ఏప్రిల్ 9 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 12న వరంగల్ నగర పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు, నగర కమిషనర్ సత్పతితో కలి సి రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భా గంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్ఐటీ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలావరంగల్ వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. పశ్చిమ పరిధిలోని ఎన్ఐటీ, వడ్డేపల్లి శివాలయం వద్ద బండ్, కాకతీయ యూనివర్సిటీ ఎక్స్‌రోడ్డు, అంబేద్కర్ జంక్షన్, ఇరిగేష న్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జైన్ మం దిర్, చౌరస్తా రోడ్డు, పద్మాక్షిగుడి, భద్రకాళీ బండ్, న్యూశాయంపేటలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రదేశాలను పరిశీలించారు. అలాగే ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్, నగర కమిషనర్ కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కరీమాబాద్‌లో దసరా రోడ్డు, రంగశాయిపేట జంక్షన్ వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్మార్ట్ రోడ్డు పనులు, ఖిలావరంగల్ గ్రౌండ్, అండర్ బ్రిడ్జి పనులు, సీబీసీ చర్చి, ఎనుమాముల మార్కెట్, లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మండిబజార్‌లో షాదీఖాన, దేశాయిపేటలోని జర్నలిస్టుల కాలనీ లో డబుల్బెడ్రూం ఇళ్లు ప్రారంభోత్సవం చేసే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి..
ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి ముసాయిదా మార్గదర్శకాలు
తక్కువ సిబిల్ స్కోర్‌తోనూ పర్సనల్ లోన్.. అయితే