న్యూఢిల్లీ: మీరు ఏదైనా రుణం తీసుకోవాలంటే మెరుగైన క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. నిర్దిష్ట ప్రమాణాలకంటే తక్కువ క్రెడిట్/ సిబిల్ స్కోర్ ఉన్న వారికి రుణాలివ్వడానికి బ్యాంకర్లు ముందుకు రారు. సాధారణంగా పర్సనల్ లోన్ తీసుకోవాలంటే మీ క్రెడిట్ స్కోర్ కనీసం 650, అంతకంటే ఎక్కువగా ఉండాలి.
క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్.. ఒక రుణ గ్రహీతగా మీరు ఇంతకుముందు తీసుకున్న రుణ చెల్లింపుల్లో మీ బిహేవియర్‌ను నిర్దేశిస్తుంది. కనుక క్రెడిట్ స్కోర్.. ఒక రుణ దరఖాస్తు అప్రూవల్ పొందాలంటే క్రెడిట్ స్కోర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
బ్యాంకులు ఎక్స్పీరియన్, ఈక్విఫ్యాక్స్, క్రెయిఫ్తోపాటు సిబిల్ వంటి సంస్థల నుంచి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మీ క్రెడిట్ చరిత్ర పొందుతాయి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే ఒక రుణ గ్రహీత ఎక్కువ రుణం పొందేందుకు వీలు ఉంటుంది.
మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు రుణం పొందడానికి, క్రెడిట్ కార్డు అప్లికేషన్ అప్రూవ్ అవుతాయి. మీ క్రెడిట్ హాబిట్లు, రీపేమెంట్స్ హిస్టరీ, క్రెడిట్ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు తీసుకున్న రుణాలు, ఎంక్వైరీల సంఖ్య, క్రెడిట్ యుటిలైజేషన్ తదితర అంశాలపై మీ క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది.
మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా రుణం లభిస్తుంది.. అయితే ఆ రుణం తక్కువగా ఉండటంతోపాటు అధిక వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగానే బ్యాంకర్లు మీ ఆదాయానికి వనరుల గురించి అడుగుతారు. రుణ వాయిదాలు చెల్లించడానికి మీ ఆదాయంపై స్పష్టమైన ఆధారాలు చూపితే రుణం లభిస్తుంది.
తొలుత తక్కువ రుణం మంజూరు చేసినా.. సకాలంలో వాయిదాల మేరకు చెల్లించేస్తే, మళ్లీ రుణం తీసుకోవచ్చు. ఆస్తి లేదా బంగారం తాకట్టు పెడితే రుణం త్వరగా మంజూరవుతుంది.
ఒక్కోసారి సిబిల్ స్కోర్‌లో ఎర్రర్లు మీ స్కోర్ తక్కువగా ఉండటానికి కారణం అవుతాయి. ఆ ఎర్రర్లే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కనుక ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీ క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ బలోపేతం చేసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. సకాలంలో చెల్లింపులు ప్రారంభించడంతోపాటు క్రెడిట్‌పై ఎంక్వైరీలు తగ్గించగలిగితే, నిరంతరం సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకుంటూ ఉంటే అది పెరుగుతుంది.
అవసరాలను బట్టే రుణం తీసుకోవాలి.. తక్కువ రుణం అవసరమైనా పెద్ద రుణం తీసుకోవచ్చు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉందని పెద్దమొత్తంలో రుణం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వొద్దు. చిన్నమొత్తంలో తీసుకున్న రుణమే తేలిగ్గా చెల్లించొచ్చు.
జాయింట్ లోన్ తీసుకోవాలంటే.. మీ కో అప్లికెంట్ సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలి సుమా. మీ కో అప్లికెంట్ మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే మీ లోన్ అప్లికేషన్ స్పీడ్‌గా కదులుతుంది. రుణం కూడా త్వరగానే మంజూరు అవుతుంది. అయితే ఇది ఆయా బ్యాంకర్ల విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్‌పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?