e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి ముసాయిదా మార్గదర్శకాలు

ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి ముసాయిదా మార్గదర్శకాలు

ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి ముసాయిదా మార్గదర్శకాలు

హైదరాబాద్‌ : ప్రైవేటు పాఠశాల బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది బాధలను తగ్గించేందుకు ఆర్థికసాయంతో పాటు బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సజావుగా పంపిణీ చేసేందుకు ఈ క్రింది మార్గదర్శకాలను జారీచేసింది.

  • బోధన, బోధనేతర సిబ్బంది జాబితాను విద్యాసంస్థల నుండి నిర్దేశించిన ప్రొఫార్మాలో పొందడం. ఈ ప్రొఫార్మాలో బ్యాంక్‌ ఖాతా, సిబ్బంది ఆధార్‌ వివరాలు ఉంటాయి. పార్ట్‌-ఏ లో సిబ్బంది వివరాలు ఉంటే పార్ట్‌-బీ లో పాఠశాల వివరాలు ఉంటాయి.
  • జాబితాను పాఠశాల హెచ్‌ఎం తయారు చేయాలి. వాటిని ఎంఈవో లేదా కలెక్టర్‌ నియమించిన ఇతర అధికారి ధృవీకరిస్తారు.
  • పాఠశాల వారీగా, మండలం వారీగా సేకరించిన వివరాలను డీఈవోకు సమర్పించాలి.
  • గుర్తించబడని పాఠశాలల వివరాలు, సిబ్బంది సమాచారాన్ని కూడా సేకరించవచ్చు. అయితే వీరికి ఆర్థికసాయం చేసే అంశాన్ని ప్రభుత్వం తర్వాత తెలియజేస్తుంది.
  • జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల విషయంలో డేటా సేకరణ నిమిత్తం కమిషనర్‌, ఇతర సిబ్బంది సహాయాన్ని కలెక్టర్లు తీసుకోవచ్చు.
  • ప్రతీ స్కూల్‌ దరఖాస్తులను ఎక్సెల్‌ షీట్‌లో సాఫ్ట్‌ అండ్‌ హార్డ్‌ కాపీల్లో సేకరించాలి. వీటిని కలెక్టర్‌ పాఠశాల విద్య డైరెక్టర్‌కు పంపాలి.
  • హార్డ్‌ కాపీల ఫార్మాట్‌ను జతపరచాలి.

వివరాల సేకరణ, పరిశీలన, పంపిణీ తేదీల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

- Advertisement -

పాఠశాలల నుండి డేటా సేకరణ : ఏప్రిల్‌ 10 నుండి 15 వరకు
జిల్లా స్థాయిలో డేటా పరిశీలన : ఏప్రిల్‌ 16
రాష్ట్ర స్థాయిలో డేటా సంకలనం : 17 నుండి 19 వరకు
మంజూరు, ఆన్‌లైన్‌ బదిలీ : 20 నుండి 24 వరకు
బియ్యం మంజూరు, పంపిణీ : 21 నుండి 25 వరకు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి ముసాయిదా మార్గదర్శకాలు
ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి ముసాయిదా మార్గదర్శకాలు
ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి ముసాయిదా మార్గదర్శకాలు

ట్రెండింగ్‌

Advertisement