ఫొటోగ్రాఫర్, జనగామ : జనగామలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్(జిల్లా కార్యాలయాల సముదాయ భవనం) పనులు చకచకా సాగుతున్నాయి. కార్యాలయాల్లో ఫర్నిచర్ కూడా సిద్ధమవుతున్నది. అలాగే, జిల్లా కేంద్రానికి సమీపంలో యశ్వంతాపూర్ వద్ద చేపట్టిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దాదాపు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో జూన్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.