గిర్మాజీపేట, ఏప్రిల్ 18 : పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, నిరంతరం కష్టపడే వారిని క డుపున పెట్టుకొని చూస్తామని తూర్పు ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవా రం రాజశ్రీ గార్డెన్లో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. హనుమకొండలో నిర్వహించే మంత్రి కేటీ ఆర్ బహిరంగసభకు అధిక సంఖ్యలో పార్టీ కా ర్యకర్తలు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్పొరేటర్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోకుండా కేత్రస్థాయిలో పనిచేయాలని, నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి డివిజన్ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలను సభకు వచ్చేలా కృషిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసే ప్రతి కార్యకర్తను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, అర్బన్ యూత్ ప్రెసిడెంట్, కుడా కమిటీ సభ్యుడు మోడెం ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అండర్‌రైల్వేగేట్ ప్రాంతం 32వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని అతి పురాతన, ప్రఖ్యాతిగాంచిన నాగదేవతా సహి త కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆలయ ప్రధాన పూజారి పాలకుర్తి ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ చక్ర వార్షికోత్సవం జరిగింది. అమ్మవారికి పలురకాల లక్ష పూలతో అర్చన చేశారు. మహిళలు అమ్మవారి భజనలు, కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం అన్నదానం చేశారు. ఎమ్మెల్యే నన్నపునేని న రేందర్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నరేందర్, కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ-సుధాకర్ దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, నాయకులు ముష్కమల్ల సుధాకర్, మోడెం ప్రవీణ్, మీరిపల్లి విన య్, బౌరిశెట్టి రాజేశ్, కట్కూరి రాజేశ్, ఆల య కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.