‘ప్రాణహిత’ పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతోంది. వివిధ ప్రాంతాల ఉంచి వేలాదిగా తరలివస్తున్న వారితో కాళేశ్వర క్షేత్రం కిక్కిరిసిపోతోంది. ఐదోరోజు సోమవారం 50వేల మంది రాగా పుణ్యస్నానాలు, సైకత లింగాలకు పూజలు, పితృతర్పణాలతో త్రివేణి సంగమం సందడిగా కనిపించింది. అనంతరం కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకొని అభిషేకాలు చేశారు. అలాగే అక్కడినుంచి అర్జునగుట్టతో పాటు మహారాష్ట్రలోని సిరోంచకు వైళ్లి పుణ్యస్నానాలు ఆదరించారు. కొందరు ప్రత్యేక వాహనాల్లో, మరికొందరు ఆర్టీసీ ఉచిత బస్సుల్లో వెళ్లి పుష్కర స్నానం చేశారు. త్రివేణీ సంగమం వద్ద ప్రాణహిత నదికి సాయంత్రం అర్చకులు ఏకాదశ హారతి ఇచ్చారు. భక్తులు పూజలు, లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా ఆరో రోజు ఆలయానికి రూ.5,15,116 ఆదాయం సమకూరినట్లు ఈవో మహేశ్ తెలిపారు.
– కాళేశ్వరం, ఏప్రిల్ 18