నర్సంపేట, ఏప్రిల్25: చెన్నారావుపేట మండ లం పాపయ్యపేట గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథిని మండలం గుంజపడుగు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరా ల ప్రకారం..
పాపయ్యపేటకు చెందిన గాలి వెంక న్న కుమారుడు సందీప్(21) హనుమకొండలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువు తున్న యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమె ప్రేమను నిరాక రిస్తోంది. ఈ క్రమం లో సందీప్ ఆదివా రం సాయంత్రం మంథిని మండలం గుంజపడుగు గ్రా మంలో ఉన్న యువ తి ఇంటికి వెళ్లాడు. ఏమైందో ఏమో గాని ఆమె ఇంటి ఎదుటే అర్ధరాత్రి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నా డు. గమనించిన స్థానికులు, పోలీసులు కరీంనగ ర్లోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో పాపయ్యపేట గ్రామంలో విషా దం అలుముకుంది. మృతదేహాన్ని తీసుకొచ్చేం దుకు తల్లిదండ్రులు, బంధువులు వెళ్లారు.