గ్రేటర్లో ప్లాస్టిక్ సేకరణకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా జీడబ్ల్యూఎంసీ పరిధిలో 22 పొడి చెత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని బలోపేతం చేసేందుకు కొన్ని సెంటర్ల నిర్వహణ బాధ్యతలను ఇటీవల మహిళా పొదుపు సంఘాలకు అప్పగించారు. స్వచ్ఛ ఆటో కార్మికులు, రోడ్డుపై చిత్తు కాగితాలు ఎరుకునే వారు ఈ సెంటర్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయించి ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం కల్పించారు. ఓవైపు ప్రజల్లో చైతన్యం తెస్తూనే మరో వైపు నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలపై గట్టి నిఘా పెట్టనున్నారు.
వరంగల్, ఏప్రిల్ 29 : స్మార్ట్‌సిటీగా మారుతున్న చారిత్రక వరంగల్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి గ్రేటర్ కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి రోజు సుమారు 430 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే అందులో సగానికి పైగా ప్లాస్టిక్ ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రజలను ప్లాస్టిక్ ఫ్రీ లక్ష్య సాధనలో భాగస్వామ్యం చేస్తేనే అనుకున్నది సాధించొచ్చని గ్రేటర్ అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 22 పొడి చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే శ్రీ ఫౌండేషన్, ఐటీసీ, వావ్ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. పొడి చెత్తలోని ప్లాస్టిక్‌ను వేరు చేసి సెంట్రల్ హబ్‌కు తరలిస్తున్నారు. ఇటీవల మహిళా పొదుపు సంఘాలకు కొన్ని సెంటర్ల నిర్వహణను అప్పగించారు.
వరంగల్‌ను ప్లాస్టిక్ రహితం నగరాన్ని తీర్చిదిద్దాలన్న గ్రేటర్ సంకల్పం సాకారం కావడం లేదు. అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం రావడం లేదు. దీంతో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక వైపు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూనే మరోవైపు ప్లాస్టిక్ విక్రయాలపై గట్టి నిఘా పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో 22 పొడి చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పొడి చెత్త సేకరణ కేంద్రాలు పనిచేస్తాయి. స్వచ్ఛ ఆటోల నిర్వాహకులు, రోడ్డుపై ప్లాస్టిక్ వస్తువులు, కాగితాలు ఎరుకునే వారు ఈ సెంటర్లలో విక్రయించుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థ వస్తువులు ఇంట్లో ఉన్న వారు నేరుగా పొడి చెత్త సేకరణ కేంద్రాల్లో విక్రయించుకోవచ్చు. దీంతో ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా నగరం సంపూర్ణంగా ప్లాస్టిక్ రహితంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
1) కుమార్‌పల్లి వాటర్ ట్యాంకు, 2) పాత మున్సిపల్ వార్డు కార్యాలయం, 3) పిల్లల పార్కు, బాలసముద్రం 4) పోలీసు కాలనీ, 5) పాత వెటర్నిటీ భవనం, దర్గా కాజీపేట, 6) న్యూ శాయంపేట వాటర్‌ట్యాంకు, 7) నయీంనగర్ వార్డు కార్యాల యం, 8) నక్కలగుట్ట వాటర్‌ట్యాంకు, 9) గోపాల్పూర్ జీపీ కార్యాలయం, 10) భవానీనగర్ వాటర్ ట్యాంకు, 11) సుబేదారి వాటర్ ట్యాంకు, 12) కాజీపేట వాట ర్ ట్యాంకు, 13) ప్రశాంత్‌నగర్ వాటర్ ట్యాంకు, 14) మచిలీబజార్ వాటర్ ట్యాం కు, 15) హనుమాన్‌నగర్ ఫైన్ ఫంక్షన్ హాల్ పక్కన, 16) హసన్‌పర్తి జీపీ కార్యాల యం, 17) రంగశాయిపేట వాటర్ ట్యాంకు, 18) చార్‌బౌళి వాటర్ ట్యాంకు, 19) పోతననగర్ ట్రాన్స్ఫర్స్టేషన్, 20) శివనగర్ రైల్వేస్టేషన్ రోడ్డు, 21) దేశాయిపేట ఫిల్టర్‌బెడ్, 22) రీసైక్లింగ్ పార్కు (సెంట్రల్ హబ్) కేయూ ఫిల్టర్‌బెడ్, పలివేల్పుల రోడ్డు, భీమారం