రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని గిరిజన సంక్షేమ భవన్లో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, హుజూరాబాద్ (కమలాపూర్ మండలం), పరకాల నియోజకవర్గం పరిధిలోని 43 మంది దళిత బంధు లబ్ధిదారులకు రూ.4,08,08,751 విలువైన 31 యూనిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని తెలిపారు. అంబేదర్ ఆశయ సాధనలో భాగంగా దళిత సాధికారత కోసం దేశంలోనే ఎకడాలేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని ఆయన వివరించారు.
లబ్ధిదారులు లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకోవాలని చీఫ్ విప్ కోరారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ నిన్నటి వరకు కూలీలుగా ఉన్నవారు ఈ పథకంతో నేడు ఓనర్లుగా మారుతున్నారని పేర్కొన్నారు.
హనుమకొండ, ఏప్రిల్ 14 : దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అ న్నారు. హనుమకొండలోని గిరిజన సంక్షేమ భవన్లో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, హు జూరాబాద్ (కమలాపుర్ మండలం), పరకా ల నియోజకవర్గం పరిధిలోని 43 మంది దళి త బంధు లబ్ధిదారులకు రూ.4,08,08,751 విలువైన 31యూనిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అంబేదర్ ఆశయ సాధనలో భాగంగా దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ దేశంలోనే ఎకడాలేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
అందులో భాగంగా రాష్ట్రంలోని దళిత ఆర్థిక పరిపుష్టికి దళితబం ధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ ప థకం ద్వారా అర్హులైన దళిత కుటుంబాలకు వంద శాతం సబ్సిడీతో రూ.10లక్షల ఆర్థిక సా యం అందిస్తున్నట్లు వివరించారు. లబ్ధిదారు లు లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా అంబేదర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సంక్షేమ కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దళితుల పట్ల సమాజంలో నెలకొన్న తారతమ్యాలను రూపు మాపడమే దళిత బంధు పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు.
నిరుపేద దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంతో నిన్నటి వరకు కూలీలుగా ఉన్నవారు నేడు ఓనర్లుగా మారుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, ఈ పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. దళితబంధు పథకం నిరంతర ప్రక్రియ అని, లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే అరూరి కోరారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో వాసుచంద్ర, హనుమకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత పాల్గొన్నారు.