జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, పంచాయతీ వార్డులు, ఎంపీటీసీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ప్రదర్శించారు. జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 21 వరకు తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా రూపొందించి నోటిఫై చేయనున్నారు. 23 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు.
వరంగల్, ఏప్రిల్ 14(నమస్తేతెలంగాణ) : రాష్ట్రం లో ఖాళీగా ఉన్న సర్పంచ్, పంచాయతీ వార్డులు, ఎం పీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లోని వార్డుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. గత జనవరిలో రూపొందించిన ఓటరు జాబి తా నుంచి ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి ము సాయిదా ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు.
ఏప్రిల్ 21వరకు తుది ఓటరు జాబితాను వార్డు ల వారీగా తయారు చేసి నోటిఫై చేయాలని జిల్లా పం చాయతీ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 23 వర కు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో తుది ఓటరు జాబితా విడుదల చేసి ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, జిల్లాలో అవసరమైన ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పేపరు ముద్రించడానికి అనువైన ప్రింటింగ్ కేంద్రాలు, రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని గుర్తించాలని కూడా చెప్పారు.
పోలింగ్ కేం ద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను ముందస్తుగానే ఎంపిక చేసుకోవాలని, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పడు టీ-పోల్‌లో నమోదు చేయాలని సూ చించారు. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితా త యారీ, ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు ఉప ఎన్నికలు జరిగే సర్పంచ్, పం చాయతీ వార్డులు, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయా ల వద్ద 8న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. దీనిపై జిల్లా స్థాయిలో మంగళవారం, మండల స్థాయిలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. 11 నుంచి ప్రారంభమైన అభ్యంతరాల స్వీకరణ 16 వరకు కొనసాగనుంది. వీటిని 19న పరిష్కరించి పంచాయతీల్లో 21న, ఎంపీటీసీ స్థానాల్లో 23న తుది ఓటరు జాబితా విడుదల చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీల్లో 42 వార్డు లు, 5 పంచాయతీల సర్పంచ్‌లు, 2 ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏ ర్పాట్లు చేస్తున్నారు. నెక్కొండ-2 ఎంపీటీసీ రామారపు పుండరీకం గుండెపోటుతో మరణించారు. ఆయన వైస్ ఎంపీపీగా పనిచేశారు. రాయపర్తి మండలం కొలన్‌పల్లి ఎంపీటీసీ కృష్ణమాచార్యులుపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. దుగ్గొండి మండలం లక్ష్మీపురం సర్పంచ్ తిప్పారపు గో పాల్‌రావు, చెన్నారావుపేట మండలం జల్లి సర్పంచ్ అంబాల సుధాకర్, నర్సంపేట మండలం దాసరిపల్లి సర్పంచ్ రేమిడి రాజిరెడ్డి, సంగెం మండలం ఎల్గూరుస్టేషన్ సర్పంచ్ భద్రమ్మకు అనారోగ్యం, రాయపర్తి మండలం జయరామ్తండా(కె) సర్పంచ్ లావుడ్యా భిక్షపతినాయక్ గుండెపోటుతో మృతిచెందారు. ఫలితంగా ఈ ఐదు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలొచ్చాయి.
గీసుగొండ మండలం సూ ర్యతండా, అనంతారం, దుగ్గొండి మండలం స్వామిరావుపల్లి, దేశాయిపల్లి, గొల్లపల్లి, మహ్మదాపురం, నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి, నర్సంపేట మండలం ఏనుగులతండా, కమ్మపల్లి, ముత్యాలమ్మతండా, గుం టూరుపల్లి, ఖానాపురం మండలం కీర్యతండా, బద్రుతండా, అశోక్‌నగర్, దబీర్‌పేట, చెన్నారావుపేట మండ లం అమృతండా, సంగెం మండలం ఆశాలపల్లి, ఎల్గూరురంగంపేట, కాట్రపల్లి, కృష్ణానగర్, సంగెం, వంజర్పల్లి, రాయపర్తి మండలం జయరాంతండా(ఎస్), బు ర్హాన్పల్లి, పర్వతగిరి మండలం ఏబీతండా, బూరుగుమల్ల, చింతనెక్కొండ, కల్లెడ, నారాయణపురం, హరిచంద్‌తండా, రెడ్లవాడ, నెక్కొండ, ముదిగొండ, పనికె ర, రామన్నకుంటతండాలో మొత్తం 42 వార్డులకు ఉ ప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతో ఉప పోరు జరిగే సర్పంచ్, పంచాయతీ వార్డులు, ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్న ఆశావహు లు మద్దతు కోసం పావులు కదుపుతున్నారు.