
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి
ఆఫ్లైన్లోనే క్లాసులు నిర్వహించాలి
తాండూరు, ఆగస్టు 26: వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నంబర్-1 ఉన్నత పాఠ శాలలో తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాల నిర్వాహకులతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి హన్మంతరావు మాట్లాడుతూ విద్యాలయాల్లో శుభ్రత బాధ్యత పాఠశాల నిర్వాహకులదేనని సూచించారు. పాఠశాల గదులను, పరి సరాలను 30వ తేదీ వరకు శుభ్రం చేసి శానిటైజేషన్ చేయాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కు తప్పనిసరి ధరించాలన్నారు. మాస్కు లేకుంటే తరగతి గదిలోకి అనుమతించొద్దని తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పని సరిగా ఏదో ఒక డోసు వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని, లేదంటే వారం రోజుల్లో తీసుకోవాలని సూచించారు. తరగతి గది సైజును బట్టి విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా సీట్లు ఏర్పాటు చేయా లన్నారు. విద్యార్థుల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించాలన్నారు. విద్యుత్, వాటర్ ఇతర ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే అధికారులకు తెలుపాలని సూచించారు. తాండూరు ఎంఈవో వెంకటయ్యగౌడ్ మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ నెల 30లోగా పాఠశాలలను శుభ్రం చేసి, శానిటైజేషన్ చేసినట్టు ప్రతి పాఠశాల నుంచి సర్టిఫికెట్ ఇవ్వా లని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆఫ్లైన్లో మాత్రమే క్లాసులు నిర్వహించాలని, ఆన్లైన్లో నిర్వహించరాదని సూచించారు. అందుకు తగ్గట్లు కొవిడ్ నియమాలు పాటి స్తూ పాఠశాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదం డ్రులు కూడా అందుకు సహకరించాలన్నారు. విద్యాలయాల్లో నిర్ల క్ష్యం తగదని, ప్రభుత్వ సూచనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2019-20 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల వివరాలతో పాటు 2021-22 అడ్మిషన్లు పొందుతున్న విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.