
పరిగి, ఆగస్టు 25: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వ హించనున్న నేపథ్యంలో పట్టణంలోని పాఠశాలలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసు కుంటున్నట్లు పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ నెం.1లో తరగతి గదులు, ఆవరణలో చెత్త, చెదారం తొల గించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి పాఠ శాలను శుభ్రంగా ఉంచే విధంగా చూస్తామని, చెత్త, చెదారం తొలగింపు అనంతరం సోడియం క్లోరైడ్ పిచికారీ చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్ ఎదిరె క్రిష్ణ, టీఆర్ఎస్ నాయకుడు బి.రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజిలయ్య పాల్గొన్నారు.
కొడంగల్, ఆగస్టు 25: కొడంగల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ అధ్యక్షతన పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనాలకు రంగులు వేయించడం, తరగతి గదులకు శానిటేషన్ వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్‌లాల్, ఎంపీవో శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హుస్సేన్, పంచాయతీరాజ్ ఏఈ మధుతో పాటు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
బంట్వారం, అగష్టు25: మండలంలోని ప్రతి పాఠశాలను శుభ్రం చేయాల్సిన బాధ్యత సంబంధిత గ్రామ సర్పంచ్‌లదేనని మండల ప్రత్యేకాధికారి సుజాత పేర్కొన్నారు. బుధ వారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలకు విద్యార్థులు వచ్చే విధంగా మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్య క్రమంలో ఎంపీడీవో బాలయ్య, ఏపీవో సుధాకర్ పాల్గొన్నారు.
బంట్వారం, ఆగస్టు 25: మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ ఉమా దేవి చందుసింగ్, పంచాయతీ కార్యదర్శి వెంకట్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బుధ వారం పారిశుధ్య పనులు చేయించారు. పాఠశాలలో పేరుకుపోయిన పిచ్చి గడ్డి తొల గించడం, పాఠశాల గదుల్లో పేరుకు పోయిన బూజు దులిపి శుభ్రం చేయించారు.
కోట్‌పల్లి, ఆగస్టు 25: మండల పరిషత్ కార్యాలయంలో మండల పాఠశాలల ప్రధానో పాధ్యాయులు, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, అంగన్వాడీ టీచర్లతో మండల ప్రత్యే కాధికారి రాజేశ్వర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పాఠశాలలను శుభ్రం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో డానియేల్ పాల్గొన్నారు.
మర్పల్లి, ఆగస్టు 25: సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున ప్రభుత్వ కళాశాల, పాఠశాలలను శుభ్రం చేసి శానిటేషన్ చేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారి, మండల ప్రత్యేకాధికారి వరప్రసాద్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాల యంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది నుంచి పాఠశాలలు మూతపడినందున పాఠ శాలల్లో పిచ్చి మొక్కలు పెరిగి పోయాయని, పిచ్చి మొక్కలను, గదుల్లో చెత్తను తొల గించి శుభ్రం చేయించే బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాల న్నారు. పాఠశాలల్లో నీటి సౌకర్యం కల్పించాలని, మరుగుదొడ్లు వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట్రామ్‌గౌడ్, ఎంపీ వో సోమలింగం, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కులకచర్ల, ఆగస్టు 25: కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని వివిధ పాఠశాలల్లో శుభ్రత పనులు ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చౌడాపూర్ మం డల పరిధిలోని మందిపల్ గ్రామ పంచాయతీలో బుధవారం గ్రామ సర్పంచ్ మఠం ప్రమీల పాఠశాలలను శుభ్రం చేయించారు. పాఠశాలలో గడ్డిని తొలగించడంతో పాటు చెత్తను తొలగించి పాఠశాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో మందిపల్ పాఠశాల చైర్మన్ కావలి రాములు, బంగరం పల్లి కేశవులు, మఠం రాజశేఖర్, వడ్డే బాల్‌రాజ్, కావలి చెన్నయ్య, కేశవులు, శ్రీనివాస్, నందు పాల్గొన్నారు.
బషీరాబాద్, ఆగస్టు 25 : పాఠశాలల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శుభ్రత నిర్వహిం చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి స్టీవెన్‌నిల్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యద ర్శులకు పరిశుభ్రతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లా డుతూ కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రా రంభిం చాలని నిర్ణయించిందన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాఠశా లలను శుభ్రం చేయించాలని సూచించారు. సమావేశం అనంతరం ప్రత్యేకాధికారి బషీరా బాద్ సర్పంచ్ ప్రియాంక, ఎంపీవో రమేశ్‌తో కలిసి మండల కేంద్రంలోని హాస్టళ్ల ను పరిశీలించారు. విద్యుత్, మంచినీటి సౌకర్యాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో రమేశ్ పాల్గొన్నారు.
తాండూరు రూరల్, ఆగస్టు 25 : పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యా యులం దరూ వంద శాతం పాఠశాలలకు హాజరు కావాలని జిల్లా యువజన సంక్షేమ అధికారి హన్మంత్‌రావు తెలిపారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 నెలల నుంచి పాఠశాలలు ప్రారంభం కాలేదని, సెప్టెంబరు 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయని, ఉపాధ్యాయులందరూ సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్ల సహకారంతో పాఠశాలలను పరిశుభ్రం చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్య గౌడ్ ఉన్నారు.