
గ్రామంలో మౌలిక వసతుల కల్పన
అందుబాటులోకి వైకుంఠధామం
కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
గల్లీగల్లీలో సీసీ రోడ్లు
పరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీట
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
పల్లె ప్రగతితో గుండాల గ్రామానికి మహర్దశ
మౌలిక వసతుల కల్పన
అందుబాటులోకి వైకుంఠధామం
ముమ్మరంగా అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు
ప్రతివీధిలో సీసీ రోడ్డు
పరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీట
మారిన గ్రామ రూపురేఖలు
దోమ, ఆగస్టు 18 : పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మారుమూల పల్లెలు సైతం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత రవాణా వ్యవస్థ మెరుగు పడటంతో గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో హరితహారంలో భాగంగా మొక్కలు విరివిగా నాటడంతో పాటు పల్లె ప్రకృతి వనంలో రకరకాల మొక్కలు నాటడంతో గ్రామానికి కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. గ్రామంలో పాడుబడిన బావులు, గుంతలు పూడ్చివేయడం, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేయడంతో గ్రామంలో మరింత పరిశుభ్రత చేకూరింది. పల్లె ప్రగతికి ముందు గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు పెంటలు దర్శనమిచ్చేవి. ప్రస్తుతం కంపోస్టుషెడ్డు, డంపింగ్ యార్డు నిర్మాణంతో ఆ గోస తీరింది. వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. గ్రామంలో రూ.18 లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్లను ప్రతి వీధిలో వేశారు. రూ.10లక్షల వ్యయంతో గ్రామంలో అండర్డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పంచాయతీ అనుబంధ గ్రామమైన గుండాల తండాలో సీసీ రోడ్లను పూర్తి చేశారు. పరిశుభ్రత కోసం పంచాయతీకి ట్రాక్టర్, పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ పనులతో పల్లెలు ప్రగతిబాట పట్టాయి. పల్లె ప్రగతితో ఈ గ్రామానికి మహర్దశపట్టింది. గుండాల గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో 20412 మంది ప్రజలు జీవనం సాగిస్తుండగా 538 నివాసాలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామంలో వ్యవసాయం ద్వారా ప్రజలు ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత కన్పిస్తున్నది. నిధులు పుష్కలంగా అందుతుండటంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనతో సమస్యలన్నీ తీరుతున్నాయి.
పల్లె ప్రగతితో అభివృద్ధి
పల్లెల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి ఎంతో ఉపయోగపడింది. ప్రభుత్వం అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పనులు చేపడతా. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తాను.
-సుజాతారెడ్డి, గుండాల సర్పంచ్
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ఒకప్పుడు మండలాలకు వచ్చే నిధులు ప్రస్తుతం పల్లెలకు వస్తున్నాయంటే అది సీఎం కేసీఆర్ సార్ ఘనతే. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తూ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నది. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం అభినందనీయం
మౌలిక వసతులపై దృష్టి పెట్టాం
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టాం. పంచాయతీ పాలకవర్గం తీసుకునే నిర్ణయాలకనుగుణంగా పనులు నిర్వహిస్తున్నాం. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకున్నాం. పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులను పూర్తి చేశాం.