
మూడు వారాలకు పైగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు నీరులేక వాడిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందారు. కానీ రెండు, మూడు రోజులుగా జిల్లా అంతటా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరిపోశాయి. పత్తి, సోయాబీన్, కంది, పసుపు, ఇతర పంటలకు మేలు చేకూరింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,88,475 ఎకరాలు కాగా ఇందులో 5,00,483 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. జిల్లావ్యాప్తంగా సాధారణ వర్షపాతం 428.9 మి.మీ కాగా 505.9. మి.మీ కురిసింది.
వికారాబాద్, ఆగస్టు 18, (నమస్తే తెలంగాణ): రెండు, మూడు రోజులుగా జిల్లా అంతటా కురుస్తున్న మోస్తరు వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. పత్తి, సోయాబీన్, కంది, పసుపు ఇతర పంటలకు మేలు జరిగింది.ఈ వానకాలంలో జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,88,475 ఎకరాలు కాగా, 5,00,483 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. పత్తి అధిక మొత్తంలో సాగుకాగా, వరి గతేడాదిని మించి సాగైంది. కందని అంతర్ పంటగా సాగు చేశారు. జొన్న, పెసర, మినుము, సోయా కొద్ది మొత్తంలో సాగు చేస్తున్నారు. మొక్కజొన్న, నువ్వు లు, స్వల్పంగా సాగయ్యాయి. మూడు వారాల విరామం తర్వాత వర్షం కురుస్తుడంటంతో రైతన్నలు ఊరట చెందారు. జిల్లాలో అన్ని మండలాల్లో కలిపి వర్షపాతం 18 మి.మీగా నమోదైంది. కొడంగల్ మండలంలో అత్యధికంగా 44.0మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షంతో ఆరుతడి, వరి పంటలు వేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 22, 23, 24 తేదీల్లో కురిసిన వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంట లు నిండాయి. అదే విధం గా జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండా యి. ఆ తర్వాత అంటే 25 త ర్వాత వర్షాలు కురవలేదు. దీంతో రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురు చూశారు. ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసిన రైతులు వర్షాల కోసం ప్రార్థించారు. జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల వరి నాట్లు వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు మరింత మేలు జరు గుతుందని రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పేర్కొం టు న్నారు. ఎనిమిది మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా.. పది మం డలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఒక మండలంలో సాధా రణం కంటే తక్కువగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 428.9 సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..505.9.మి.మీ వర్షపాతం నమోదు చేసుకుంది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు అను కూలమైనవి. ఎరువులు వేసేందుకు, కలుపు తీసేందుకు ఇదే సరైన సమయం. వర్షాభావ పరి స్థితుల నుంచి పంటలను నిలబెట్టే విధంగా రైతులు కొంత కృషి చేయా లి. ఈ వర్షాలతో మొక్కలకు లాభం చేకూరుతుంది.
-గోపాల్, డీఏవో, వికారాబాద్ జిల్లా
రెండు రోజులుగా వర్షాలు కురుస్తూ పంటలకు జీవం పోసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వర్షాలు దూరం అయ్యాయనే బెంగతో పంటలకు ఎరువులు వేయలేకపోయాం. వర్షా లు కురుస్తుండడంతో పత్తి, కంది, పెసర తది తర పంటలకు ఎరువులు వేసుకోవడంలో నిమగ్నమయ్యాం. వర్షాలు ముందే కురిసినైట్లెయితే పంటలు ఏపుగా పెరుగుతుండే.
నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో పొలాల్లో తడి ఆరిపోయింది. భూమిలో తడి లేక ఎరు చల్లుకోలేదు. బోరుబావులు ఉన్న రైతులు డ్రిప్ సాయంతో పసుపు పంటకు నీళ్ళు పెట్టు కున్నా రు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షా లతో పంటలకు మంచి జరిగింది. రైతులపై భగవంతుడు కనికరించి మంచి వర్షాలు కురిపించాలి.