
పూడూరు, ఆగస్టు 17: దామగుండం రామ లింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మం డలం దామ గుండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి బాధ్యతల స్వీకరణ, గోమాత సంరక్షణ, వృక్ష సంపద పెంపొందించే కార్యక్రమాన్ని సత్యానందస్వామి, సర్పంచ్ నవ్యరెడ్డిల ఆధ్యర్యంలో నిర్వహించారు. ముఖ్య అతి థులుగా స్థానిక ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రంజి త్‌రెడ్డి మాట్లాడుతూ కులమతా లకు అతీతంగా కమిటీని ఏర్పాటు చేసి దేవాలయ కృషి చేయాలన్నారు. దామగుండ రామలింగేశ్వర స్వామి ఆల యం ఎంతో పురాతన దేవాలయం అని ఈ ప్రాంతాన్ని చూస్తేనే అర్థ మౌతుందన్నారు. స్థానికుల కోరిక మేరకు దామగుండం ప్రాంతంలో ఏర్పాటు చేసే నేవిసిగ్నల్ కేం ద్రం నిర్మాణంపై వచ్చే పార్లమెంట్ సమావేశంలో మా ట్లాడుతానన్నారు. అవకాశం ఉంటే మరోసారి ప్రజా బిప్రా య సేకరణ చేసేలా కృషి చేస్తానన్నారు. దామ గుండంలో అమృతంగమయ ఎన్వీరాన్ మెంటల్ చారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమాత రక్షణ, వృక్షాల సంర క్షణకోసం పెన్షన్‌ను ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. రైతులు గోవధకు గోవులను విక్రయించకుండా, గోవు మృతి చెం దాక అంత్యక్రియలు చేసే రైతుకు ట్రస్ట్ ద్వారా రూ. 35వేలు అందజేయడం సం తోషమైన విషయం అన్నా రు. దామగుండం దేవాలయం అభివృద్ధికి తన వం తుగా రూ.లక్ష విరాళం ఇస్తానని ఎంపీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ దేవా లయం చుట్టూ ఉన్న ఫారెస్ట్ భూముల్లో నేవిసిగ్నల్ కేంద్రం ఏర్పాటుకు సరైన ప్రజాభిప్రాయం సేకరించకుండా అప్పటి కాంగ్రెస్ ప్ర భుత్వం కేంద్రానికి అప్పగించింద న్నారు.దేవాలయంపై రూ.10లక్షలు ఫిక్స్ డిపా జిట్ చేస్తే దేవాదాయ శాఖ నుండి రూ.40లక్షలు మం జూరు అయ్యేలా తన వంతు కృషి చేస్తానన్నారు. దేవాలయానికి ఉన్న 33 ఎకరాల భూమిని సర్వే చేయించి దేవా లయానికే ఉండేలా చూ స్తామన్నారు. కార్యక్ర మంలో టీఆర్ఎస్ నేత కె.అనిల్‌రెడ్డి, ఎంపీపీ మల్లే శం, జడ్పీటీసీ మేఘమాల, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు నర్సింహారెడ్డి, కిషన్ నాయక్, ఉపసర్పంచ్ రాజేందర్, తాజోద్దీన్, కృష్ణగిరిస్వామి, దేశ్ పాండే, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, రైతు మండల సమన్వయ సమితి కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, అనంతరెడ్డి ఉన్నారు.