
వికారాబాద్/పరిగి/బొంరాస్‌పేట/ధారూరు, ఆగస్టు 16: హుజూరాబాద్‌లో సోమవారం దళితబంధు పథకం ప్రా రంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగసభకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నాయకులు తరలివెళ్లారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో పాటు ప్రజా ప్రతి నిధులు, నాయకులు వెళ్లారు. బొంరాస్‌పేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోట్ల యాదగిరి, వైస్ ఎంపీపీ నారా యణరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, ఎంపీటీసీ ఎల్లప్ప, పార్టీ నాయకులు నరేష్ గౌడ్, టీటీ రాములు, దేశ్యానాయక్, కొడంగల్ మండలం నుంచి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, పార్టీ నాయకులు దామోదర్‌రెడ్డి తరలి వెళ్లారు. ధారూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేశం, మండల రైతు బంధు అధ్యక్షుడు రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజు నాయక్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజుగుప్త, కుమ్మరిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోష్ కుమార్, అంజయ్య, వెంకట య్య, వెంకట్రాంరెడ్డి, దేవేందర్ హుజూరాబాద్ వెళ్లిన వారిలో ఉన్నారు. పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు వాహ నాలలో హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారం భించే సభకు వెళ్లారు. దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, దోమ వైస్ ఎంపీపీ మల్లేశం, నార్మాక్స్ డైరెక్టర్ పి.వెంకట్రాంరెడ్డి, సర్పంచ్‌లు నల్క జగన్, వెం కటయ్య, ప్రవీణ్, రాంచెంద్రయ్య, ఎంపీటీసీ యాదయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు హుజూరాబాద్ సభకు వెళ్లారు.