
కులకచర్ల, ఆగస్టు 16: బాలల హక్కుల పరిరక్షణలో గ్రామ పంచాయతీలు ప్రముఖపాత్ర పోషించాలని ఎంపీపీ సత్య హరిశ్చంద్ర అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బాలలహక్కుల పరి రక్షణ-పంచాయతీల పాత్ర అనే అంశంపై పంచాయతీ కార్య దర్శులకు, అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం నిర్వహిం చా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలలహక్కుల పరి రక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. గ్రామా ల్లో బాలకార్మికులను గుర్తించి వారి వివరాలు అధికారులకు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా చైల్డ్‌లైన్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలకార్మిక, బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడ బ్ల్యూసీ చైర్మన్ వెంకటేశ్, కులకచర్ల ఎస్సై విఠల్‌రెడ్డి, ఎంఈవో అబీబ్హైమద్, ఎంపీవో సుందర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి సత్యనా రాయణ, సీడబ్ల్యూసీ సభ్యులు సంగమేశ్వర్, లక్ష్మణ్, అంగన్ వాడీ సూపర్ వైజర్ సరిత, వివిద గ్రామాల పంచాయతీ కా ర్యదర్శులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దోమ,ఆగస్టు16:గ్రామాల్లో బాలల హక్కుల పరిరక్షణకు గ్రా మ బాలల పరిరక్షణ కమిటీలే బాధ్యత వహించాలని ఎంపీపీ అనసూయ అన్నారు. సోమవారం దోమ మండల కేంద్రం లోని స్త్రీశక్తి భవనంలో సీడబ్ల్యూసీ అధికారి వెంకటేశం ఆధ్వ ర్యంలో బాలల హక్కుల పరిరక్షణ పై సమావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆపదలో ఉన్న బాలల సంరక్షణకై అత్యవసర ఫోన్ 1098ను సద్వి నియోగం చేసుకోవాలని చైల్డ్‌లైన్ అధికారులు కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయ రాం, ఎంఈవో హరిశ్చందర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా బాలల పరి రక్షణ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.