
వికారాబాద్, ఆగస్టు 13 : పట్టణంలో పాడుబడ్డ ఇండ్లు, బావులను తొలగించాలని ఎమ్మెల్యే ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 18, 19వ వార్డు రామయ్యగూడలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా పర్యటించి పలు సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి, నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఖాళీగా ఉన్న ఇండ్ల స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను వెంటనే కూల్చివేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని విషయాలను పలువురిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ విజయ్‌కుమార్, వైస్ చైర్పర్సన్ శంషాద్‌బేగం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కమిషనర్ శరత్చంద్ర, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, స్థానిక 18, 19వ వార్డు కౌన్సిలర్లు కృష్ణ, నర్సింహులు, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, చందర్‌నాయక్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.