
వికారాబాద్, సెప్టెంబర్ 12 : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం వికారాబాద్‌లోని 13, 14, 22 వార్డుల్లో పార్టీ కమిటీలను వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు. వార్డులతోపాటు గ్రామ కమిటీలు, మండల, మున్సిపల్ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు.
టీఆర్ఎస్కు కార్యకర్తల బలం
పరిగి, సెప్టెంబర్ 12 : టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తల బలం దండిగా ఉందని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పరిగి మున్సిపాలిటీలోని 2, 4 వార్డుల్లో పార్టీ కమిటీలను ఎన్నుకున్నారు. 2వ వార్డు టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా యాదగిరి, యూత్ అధ్యక్షుడిగా యాదయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా రెహమాన్, సోషల్ మీడియా కన్వీనర్‌గా నవీన్, 4వ వార్డు టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా యాదగిరిగౌడ్, యువజన విభాగం అధ్యక్షుడిగా హర్షిత్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా అహ్మద్ ఎన్నికయ్యారు.
పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కోట్‌పల్లి, సెప్టెంబర్ 12 : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కృషి చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు అనీల్‌కుమార్ అన్నారు. అన్నాసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎల్లయ్య, బీసీ సెల్ అధ్యక్షుడిగా జి.నర్సింహులు, రైతు విభాగం అధ్యక్షుడిగా సి.నర్సింహులు, మహిళా అధ్యక్షురాలిగా శివమ్మ, యువత అధ్యక్షుడిగా ఎ.నరేశ్, సోషల్ మీడియా అధ్యక్షుడిగా నరేశ్. బుగ్గాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మహేందర్ దొర, మహిళా అధ్యక్షురాలిగా టి.శ్యామలమ్మ, యువజన సంఘం నాయకుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ అధ్యక్షుడిగా దాసరి రవి, రైతు గ్రామ అధ్యక్షుడిగా జనార్దన్‌రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడిగా మల్లేశం. కోట్‌పల్లి కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షుడిగా సాంబయ్య, ఎస్సీ అధ్యక్షుడిగా సంతోష్‌కుమార్, బీసీ సంఘం అధ్యక్షుడిగా నరేశ్, గ్రామ రైతు అనుబంధ సంఘం అధ్యక్షుడిగా రత్నయ్య, మైనార్టీ అధ్యక్షుడిగా ఇస్మాయిల్ ఖురేషీ, మహిళా అధ్యక్షురాలిగా కమలమ్మ, సోషల్ మీడియా అధ్యక్షుడిగా హరీశ్ ఎంపికయ్యారు.
సైనికుల్లా పని చేయాలి
మర్పల్లి, సెప్టెంబర్ 12 : ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందని, పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పిల్లిగుండ్ల గ్రామ అధ్యక్షుడిగా ఉప్పు నాగప్ప, రైతు బంధు అధ్యక్షుడిగా చంద్రయ్య, రైతు బంధు మండల సభ్యుడిగా తెలుగు శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్‌గా శ్రీకాంత్‌గౌడ్. గుండ్ల మర్పల్లి గ్రామ అధ్యక్షుడిగా ధర్మన్న, రైతు బంధు అధ్యక్షుడిగా కృష్ణ, రైతు బంధు మండల అధ్యక్షుడిగా గోల్ల మల్లేశం, యూత్ ప్రెసిడెంట్‌గా ఎండీ గౌస్, సోషల్ మీడియా కన్వీనర్‌గా రజనీకాంత్. పంచలింగాల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎండీ సోఫీ, రైతు బంధు అధ్యక్షుడిగా బలవంత్‌రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడిగా ఆనందం, యూత్ ప్రెసిడెంట్‌గా కె.సంజీవులు, సోషల్ మీడియా కన్వీనర్‌గా బి.కృష్ణ. ఘణాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మశ్చేందర్, రైతు బంధు అధ్యక్షుడిగా సిద్ది ఖలీల్ మియా, రైతు బంధు మండల అధ్యక్షుడిగా మన్నె ప్రభాకర్, యూత్ ప్రెసిడెంట్‌గా మట్టం సంగమేశ్వర్, సోషల్ మీడియా కన్వీనర్‌గా పి.మొల్లయ్య. బూచన్‌పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఆకుల యాదగిరి, రైతు సంఘం అధ్యక్షుడిగా పి.విజేందర్‌రెడ్డి, రైతు మండల అధ్యక్షుడిగా రవీందర్, యూత్ ప్రెసిడెంట్‌గా రమేశ్, సోషల్ మీడియా కన్వీనర్‌గా రాజేందర్‌రెడ్డిలను ఎన్నుకున్నారు.
జోరుగా టీఆర్ఎస్ గ్రామ కమిటీలు
కులకచర్ల, సెప్టెంబర్ 12 : కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఆదివారం ఎన్నుకున్నారు. అంతారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చలివేం ద్రం శివానందం, ఉపాధ్యక్షుడిగా రాఘవేందర్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా గోపాల్‌గౌడ్, ప్రచార కార్యదర్శిగా రాజయ్య, కోశాధికారిగా చంద్రమౌళి, గౌరవాధ్యక్షుడిగా అంజయ్య ఎన్నికయ్యారు. విఠలాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సంతోష్, ఉపాధ్యక్షుడిగా బందయ్య, సంయుక్త కార్యదర్శిగా అబ్దుల్ కరీం, కార్యదర్శిగా ఆంజనేయులు, కోశాధికారిగా వడ్డె శ్రీను, కార్యవర్గ సభ్యులుగా గుండుమల్ల నర్సింహులు, మల్లేశ్, బుచ్చ య్య, చెన్నయ్య, బాలయ్య. కిష్టంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రమేశ్, ఉపాధ్యక్షుడిగా శ్రీను, సంయుక్తకార్యదర్శిగా రా జు, కార్యదర్శిగా గోపాల్, కోశాధికారిగా రాములు, కార్యవర్గ సభ్యులుగా యాదగిరి, మధురయ్య, తిరుపతయ్య, రాములు, అంజిలయ్య, అంబయ్య. గోగ్యనాయక్‌తండా అధ్యక్షుడిగా బాల్యనాయక్, కార్యదర్శిగా సేవ్యానాయక్ ఎన్నికయ్యారు.
పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం
ధారూరు, సెప్టెంబర్ 12 : కార్యకర్తలే పార్టీకి బలమని, టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ ధారూరు మండల అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యూనుస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. అల్లీపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్కతల గోపాల్, ప్రధాన కార్యదర్శిగా టి.దశరథ్, ఉపాధ్యక్షుడిగా గూని శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడిగా గూని రవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గూని భీమయ్య, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండీ బషీర్, బీసీ సెల్ అధ్యక్షుడిగా గంధం శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షుడిగా గోపాల్. చింతకుంట గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పి.రాములు, ప్రధాన కార్యదర్శిగా పి.రామ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా జె.నందం, రైతు బంధు అధ్యక్షుడిగా బి.పెంటారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడిగా పి.మహేందర్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా వి.నందం, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎం.వెంకటయ్య. దోర్నాల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ జబ్బార్, ఉపాధ్యక్షుడిగా కె.మహిపాల్, రైతు బంధు అధ్యక్షుడిగా పి.ప్రభాకర్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడిగా బోయిని సాగర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బందెయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా వి.చత్రియనాయక్, బీసీ సెల్ అధ్యక్షుడిగా బి.శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడిగా షేక్ పాషా. ధారూరు స్టేషన్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా యాదుల్లా హుస్సేనీ, ప్రధాన కార్యదర్శిగా వి.చత్రునాయక్, ఉపాధ్యక్షుడిగా సుబాన్‌జీ ఎన్నికయ్యారు.