
తాండూరు రూరల్, ఆగస్టు 12: రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. తాండూరు మండ లంలో రూ.1.40 కోట్లతో ఏడు రైతు వేదికలను నిర్మించింది. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుణంగా నూతన వ్యవసాయ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి, తక్కువ పెట్టుబడులో ఎక్కువ లాభాలు ఆర్జిం చేలా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అం దులో భాగంగానే ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక రైతు వేదిక లను నిర్మించింది. ప్రత్యేకంగా ఒక ఏఈవోను కూడా నియ మించింది. ఇక పై ఏఈవోలు రైతు వేదికల వద్ద రైతులకు అందుబాటులో ఉంటూ వారికి పంటల సాగు పై పలు సూచ న లు, సలహాలు ఇస్తూ, పంట సా గుకు తోడ్పాటను అందిం చాల్సి ఉంటుంది.
తాండూరు మండలంలోని 33 గ్రామ పంచాయతీలను ఏడు క్లస్టర్లుగా విభజించి ఏడు గ్రామాల్లో రైతు వేదికలను ని ర్మించారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20లక్షలు చొప్పున మంజూరు చేసింది. మండలంలోని అం తా రం, సిరి గిరిపేట, బెల్కటూర్, కరణ్‌కోట, చెంగోల్, నారా యణపూర్, ఐనెల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఐదువేల ఎకరాల ఒక రైతు వేదిక చొప్పున ఆయా గ్రామాల రైతులకు అందుబాటులో ఉండేలా నిర్మించారు. ఒక్కో రైతు వేదికకు ఒక ఏఈవో చొప్పున నియమించారు. అంతారం రైతు వేది కకు ఆస్మా, సిరిగిరిపేట, బెల్కటూర్ వేదికలకు శ్రీను, కరణ్ కోటకు సౌజన్య, చెంగోల్ కు శ్యామూల్, నారా యణ పూర్‌కు శిరీష, ఐనెల్లి రైతు వేదికకు సమతలను వ్యవ సా యాధి కారులు నియమించారు. ఆయా క్లస్టర్లలోని గ్రామాల రైతు లను రైతు బంధు సమితి ఆధ్వర్యంలో రైతులను ఒక చోట సమూహ పరచి, నేల స్వభాన్ని బట్టి ఏ రకమైన పంటలు పం డించాలనే అంశాలపై కూలంకుషంగా చర్చించుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికే ఐనెల్లి రైతు వేదికను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రా రంభించారు. అదేవిధంగా సిరిగిరిపేట, బెల్కటూర్, కరణ్‌కోట గ్రామాల్లోని రైతు వేదికలను స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రారంభించారు. అంతారంతోపాటు చెంగోల్, నారాయ ణ పూర్ రైతు వేదికలు ప్రారంభించాల్సి ఉంది.
మండలంలోని ఏడు రైతు వేదికలను ఇప్పటికే ఫర్నీచర్ చేరింది. ఆయా రైతు వేదికలకు కుర్చీలు, టేబుళ్లు, మైక్ సెట్టు తోపాటు ఇతర సామాగ్రి మొత్తం చేరింది.