
కొత్తూరు రూరల్, ఆగస్టు 11 : సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఎంపిక చేయటంపై టీఆర్ఎస్ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో శ్రీనివాస్‌యాదవ్‌కు అవకాశాన్ని కల్పించటంతో గొల్లకురుమ, యాదవ సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం, కోరిపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్, టీఆర్ఎస్ మండల నాయకులు సత్యనారాయణ, దేవేందర్‌యాదవ్ పాల్గొన్నారు.
బొంరాస్‌పేట, ఆగస్టు 11 : త్వరలో జరిగే హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీకి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించడంపై మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు రామకృష్ణయాదవ్, టీఆర్ఎస్ బొంరాస్‌పేట గ్రామ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ఎంపీటీసీ శ్రవణ్‌గౌడ్ బొంరాస్‌పేటలో విలేకరులతో మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విజయం సాధించడం ఖాయమన్నారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు గోపాల్‌యాదవ్, వెంకటయ్యయాదవ్, చంద్రయ్య యాదవ్, పండరినాథ్యాదవ్, అంజిలయ్యయాదవ్, మహేష్‌యాదవ్ పాల్గొన్నారు.
చేవెళ్ల టౌన్, ఆగస్టు 11 : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్వీ నియోజకవర్గం అధ్యక్షుడు నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు చంద్రకాంత్, పయాజ్, వీరేశ్, వరుణ్, చంటి, ఎజాజ్ ఉన్నారు.