
తాండూరు రూరల్, ఆగస్టు 10: బాలల హక్కులను కాపా డేందుకు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా బాల రక్ష భవన్ కో ఆర్డి నేటర్ శ్రీలక్ష్మి అన్నారు. మంగళవారం తాండూరు ఎంపీడీవో కార్యా లయంలో సర్పం చులకు, అంగన్వాడీ టీచర్లకు ‘బాలల పరిరక్షణ’ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏండ్లలోపు అమ్మాయిలకు, 21 ఏండ్ల లోపు అబ్బా యిలకు వివాహం చేయడం చట్టపరంగా నేరమని తెలిపారు. బాల్య వివాహాన్ని ప్రొత్స హించిన తల్లిదండ్రులు, సంరక్షకులకు కూడా శిక్ష పడుతుందన్నారు. బాల్య వివాహాల పై చైతన్య తీసుకు వచ్చేందుకు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో బాలికల సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించలన్నారు. గ్రామ స్థాయిలో తప్పని సరిగా వివాహాలను నమోదు చేయించాలని సూచించారు. అదేవిధంగా జనన, మరణల వివరాలు కూడా నమోదై ఉండాలన్నారు. గ్రామ బాలల పరిరక్షణ సభ్యుల వివరాలు పంచాయతీ కార్యాయాల్లో ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, సీడబ్ల్యుసీ సభ్యులు సబిత, లక్ష్మణ్, సూపర్వైజర్లు నిర్మల, ఛైల్డ్‌లైన్ ప్రతినిధులు జ్యోతి తదితరులు ఉన్నారు.
కొడంగల్, ఆగస్టు 10: బాల్య వివాహాలు, 14 సంవత్సరాలలోపు చిన్నారులతో పనులు నిర్వహించడం చట్టరీత్యా నేరమని స్తుందని ఎంపీడీవో మోహన్‌లాల్ తెలిపారు. మంగళ వారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ-గ్రామ పంచా యతీ ల పాత్రపై గ్రామ బాలల పరిరక్షణ కమిటీ-విధివిధానాలపై ప్రజా ప్రతినిధుల, అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన అవగాహనలేక పోవడంతోగ్రామాల్లో నేటికీ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే14 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులతో వేతనపు పనులు నిర్వహించుకొం టున్నట్లు తెలిపారు. యుక్త వయస్సు వచ్చే వరకు వివాహాలు తలపెట్టవద్దన్నారు. బాల్య వివాహాలు, చైల్డ్ లేబర్ నివారణలకు గాను ప్రత్యేకంగా బాలల సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కమిటీ సభ్యులు గ్రా మాల్లో సర్వేలు నిర్వహించి అవగాహనలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీవో శ్రీనివాస్, సీడబ్ల్యూసీ సభ్యులు ప్రకాశ్‌తో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
దౌల్తాబాద్ ఆగస్టు 10: బాలలహక్కుల పరిరక్షణలో గ్రామ పంచాయతీల పాత్ర ఉం డాలని సీడబ్ల్యూసీ కమిటీ చైర్మన్ వెంకటేశ్ అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయ్‌కుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీవో రవీందర్ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ గ్రామ పంచా యతీల పాత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్ మా ట్లా డుతూ అక్రమ దత్తత చట్టవిరుద్ధమన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో విలేజ్ చైల్డ్ ప్రొ టెక్షన్ కమిటీని సర్పంచ్ అద్యక్షతన ఏర్పాటు చేయాలని సూచించారు. కార్య దర్శు లు గా అంగన్వాడీ టీచర్లను నియమించాలని కోరారు. తల్లిదండ్రులు లేని చిన్నారులు ఉం టే ఎంపీడీవో గారి దగ్గరికి తీసుకవస్తే గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ చేయిస్తా మ న్నా రు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల స్వామి,అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఐసీడీఎస్ సుపర్వైజర్ జయశ్రీ పాల్గొన్నారు.