
కొత్తూరు/నందిగామ: తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 500 మంది జనాభా ఉన్న ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. అనంతరం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.
నందిగామ మండలంలోని చాకలిగుట్ట తండా, రంగాపూర్ పంచాయతీలో అనుబంధ గ్రామంగా ఉండేది. ఈ తండా అభివృద్ధికి అరకొర నిధులు ఖర్చు చేసేవారు. దీంతో చాకలిగుట్ట తండాలో సమస్యలు పేరుకుపోయాయి. సీఎం కేసీఆర్ చాకలిగుట్ట తండాను కొత్త పంచాయతీగా ఏర్పాటుచేశారు. ఇందులో ధన్‌సింగ్‌తండా, తాటిగడ్డ తండాను కలిపారు. పంచాయతీగా ఏర్పడిన నాటి నుంచి ఈ తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. సీసీ రోడ్లకు రూ.75 లక్షలు ఖర్చుచేశారు. అంతర్గత డ్రైనేజీల కోసం రూ.28.70లక్షలు వెచ్చించారు. రూ. 5.02లక్షలతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటుచేసి తండాలను కాంతిమయంగా మార్చారు. పల్లె ప్రకృతి వనం కోసం రూ.7.80 లక్షలు ఖర్చు చేశారు. కంపోస్టుయార్డు, వైకుంఠధామం నిర్మించి ప్రజలకు ఇబ్బందులను దూరం చేశారు.
గ్రామంలో పచ్చదనం కోసం పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి 10వేల మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా 1000 మొక్కలు నాటారు. కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం 1500 మొక్కలు, హోమ్స్టెల్ ప్లాంట్స్ 1500 ఉన్నాయి. నర్సరీలో 10వేల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి వాటిని సంరక్షించేలా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా నేషనల్ హైవే 44, గ్రామాని వచ్చి పోయే రోడ్లపై 1900 మొక్కలు నాటారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా 250 మొక్కలు నాటారు.
చాకలిగుట్టతండాలో పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. దీనిలో భాగంగా పంచాయతీకి ట్రాక్ట ర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు. రోజూ చెత్త సేకరించి కంపోస్టు యార్డుకు తరలిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. గ్రామంలో ఏ వీధిలో చూసినా పరిశుభ్రంగా కనిపిస్తుంది.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
చాకలిగుట్ట తండాలో 924 మంది జనాభా ఉంది. గ్రామంలో మిషన్ భగీరథలో భాగంగా 6 ట్యాంకులు ఏర్పాటుచేశారు. వీటిలో 2 ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన 4 ట్యాంకుల ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని రోజూ ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. పంచాయతీ ఏర్పాటు చేసినప్పటి నుంచి నిధుల కొరత లేదు. గ్రామానికి ఎన్ని నిధులు కావాలన్నా ఇవ్వడానికి ఎమ్మెల్యే వెనుకాడరు. దీంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గ్రామంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా చాకలిగుట్ట తండా, ధన్సింగ్ తండా, తాటిగడ్డ తండాల్లో ప్రతి ఇంటికీ రోజూ చాలినన్ని తాగునీటిని అందిస్తున్నాం.
మూడు తండాలను కలిసి కొత్త పంచాయతీగా ఏ ర్పాటు చేశారు. ఈ తండాల్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నర్సరీల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నాం. వైకుంఠధామాన్ని అన్ని సదుపాయాలతో పాటు పచ్చలహారంలా మార్చాం. చెత్తను రోజూ డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం. చాకలిగుట్ట తండా, ధన్సింగ్ తండా, తాటిగడ్డ తండాల్లోని సీసీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాం. – శ్రీనివాస్‌చారి, పంచాయతీ కార్యదర్శి