వైభవంగా దేవీ నవరాత్రులు
బొంరాస్‌పేట, అక్టోబర్8: దేవీనవరాత్రి ఉత్సవాలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. బొంరాస్‌పేటలోని దుర్గమ్మ ఆలయంలో, బొట్లవానితండా మారెమ్మ ఆలయంతోపాటు మెట్లకుంట, తుంకిమెట్ల, చౌదర్పల్లి, దుద్యా ల తదితర గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతిష్ఠించిన అమ్మవార్లకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. నవరాత్రు ల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. దుర్గామాత మండపాలను విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ధనలక్ష్మిగా అమ్మవారి దర్శనం
కొడంగల్, అక్టోబర్8: దేవీ నవరాత్రులు మండలంలో వైభవంగా జరుగుతున్నాయి. హస్నాబాద్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గమ్మ శుక్రవారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దుర్గామాతకు ప్రత్యేక పూజలు
వికారాబాద్, అక్టోబర్8: వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేటలో శుక్రవారం దుర్గామాత బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ నైవేద్యా లు సమర్పిస్తున్నారు.
మోమిన్‌పేటలో..
మోమిన్‌పేట, అక్టోబర్8: మండలంలోని పలు గ్రామాల్లో అందంగా అలంకరించిన మండపాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కులకచర్లలో..
కులకచర్ల, అక్టోబర్8: కులకచర్ల మండలంలో దుర్గామాత పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రులను పురస్కరించుకుని పలు గ్రామాల్లోని ఆలయాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతిరోజూ వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పాయిపల్లి గ్రామంలో దుర్గామాత విగ్రహ దాత యాదయ్య దంపతులు శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాంబండ రామలింగేశ్వరాలయ ఆవరణలో ఉన్న దుర్గామాత అమ్మవారిని పూజారులు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనురాధాబాల్రెడ్డి, ఎంపీటీసీ పద్మారఘు , హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
నేటి నుంచి నవ చండీమహాయాగం
పూడూరు, అక్టోబర్ 8 : దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మండలంలోని రాకంచర్ల యోగనందాలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో నేడు, రేపు రెండు రోజులపాటు నవ మహాచండీయాగం, అష్టావధానం, అన్నదాన కార్యక్రమా లు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కమ్లీబాయి, మాజీ సర్పంచ్ పెంటయ్యలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలి పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.