
శంకర్పల్లి, సెప్టెంబర్ 8 : గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మండల స్థాయి నాయకులు కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపురంలో 4, 5వ వార్డుల్లో నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. 4వ వార్డు అధ్యక్షుడిగా ఇటుకపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా డప్పు శ్రీనివాస్, కార్యదర్శిగా గుంతల కాంతిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వానరాశి శంకరయ్య, కోశాధికారిగా ఏనుగు శేఖర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 5వ వార్డు అధ్యక్షుడిగా నోముల అనంత రాములు, ఉపాధ్యక్షుడిగా పంతం రవి, కార్యదర్శిగా కానాపురం శ్రీనివాస్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా మడికట్టు పాండు, కోశాధికారిగా గుంతల విఠల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్ష కార్యదర్శులు గోపాల్, వాసుదేవ్‌కన్నా, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు జే.రాంరెడ్డి, పాండురంగారెడ్డి, భరత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శంకర్పల్లి మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
వార్డుల్లో కమిటీల ఎన్నిక
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 8 : మున్సిపాలిటీ వార్డుల్లో మాజీ ఎంపీటీసీ దేవేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నారాయణరెడ్డి, శేఖర్ పంతులు సమక్షంలో వార్డుల వారీగా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 8వ వార్డు అధ్యక్షుడిగా డి.అనిల్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మక్బుల్, యూత్ ప్రెసిడెంట్‌గా బండి సాయి, బీసీ సెల్ ప్రెసిడెంట్‌గా విజయ్ ముదిరాజ్, మహిళ విభాగం అధ్యక్షురాలిగా సాలమ్మ, 5వ వార్డు అధ్యక్షుడిగా ఆంజనేయులు, 6వ వార్డు అధ్యక్షుడిగా సిటీకేబుల్ వెంకటేశ్, 9వ వార్డు అధ్యక్షుడిగా కటికే రాజు, 11వ వార్డు అధ్యక్షుడిగా జోగు బాలరాజు, 2వ వార్డు అధ్యక్షుడిగా గండేటి కృష్ణ, 3వ వార్డు అధ్యక్షుడిగా మాధవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ రవీందర్, కౌన్సిలర్ శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్, నాయకులు సదానందంగౌడ్, లక్ష్మయ్యయాదవ్, ప్రభాకర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, కార్తిక్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
షాబాద్, సెప్టెంబర్ 8: టీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని షాబాద్ జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సోలీపేట్, హైతాబాద్, నాందార్‌ఖాన్‌పేట్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. సోలీపేట్ గ్రామ అధ్యక్షుడిగా దేవేందర్‌యాదవ్, హైతాబాద్‌లో భూపాల్‌రెడ్డి, నాందార్ఖాన్పేట్లో శ్రీనివాస్‌గౌడ్‌లను నియమించి నియామక పత్రాలను అందజేశారు. హైతాబాద్‌లో ఆంజనేయులుతో పాటు మరికొంతమంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొన్న స్వప్న, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, సర్పంచులు రమ్య, మల్లేశ్, నాయకులు దర్శన్, నర్సింహారెడ్డి, రాంచంద్రారెడ్డి, గోపాల్, విఠల్‌రెడ్డి, యాదయ్య, మహిపాల్‌రెడ్డి, రాజుగౌడ్, శేఖర్‌రెడ్డి, సురేశ్, శ్రీనివాస్‌గౌడ్, దయాకర్చారీ తదితరులున్నారు.
పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు
చేవెళ్ల టౌన్, సెప్టెంబర్ 8 : ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో పామేన సర్పంచ్ మల్లారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మల్లపూరం ప్రవీణ్, యువజన సంఘం అధ్యక్షుడిగా తుమ్మలపల్లి వినోద్‌కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బ్యాగరి విజయ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. పల్గుట్ట గ్రామ కమిటీ అధ్యక్షుడిగా దేవులపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్ధుల్గనీ, యాదగిరి, ఎంపీటీసీ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
కేశంపేట, సెప్టెంబర్ 8 : తొమ్మిదిరేకులలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గోస్కె నర్సింహులు, ఉపాధ్యక్షులుగా కృష్ణయ్య, గోవర్దన్, ప్రధాన కార్యదర్శిగా పోగుల నర్సింహులు, కార్యదర్శులుగా బాలయ్య, శ్రీనివాస్‌తో కార్యవర్గాన్ని ఎన్నుకుని నియామక పత్రం అందజేసినట్లు తెలిపారు.
టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక
కొందుర్గు, సెప్టెంబర్ 8 : కొందుర్గు మండలంలోని అయోద్యాపూర్ తండా, రామన్నగడ్డతండా పర్వతాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని గాలిగూడ, వీరన్నపేట, పద్మారం గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, హఫీజ్, నాయకులు నారాయణ, నాంచంద్రయ్య, బాబురావు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
నందిగామ,సెప్టెంబర్ 8 : మండల అధ్యక్షుడు నోముల పద్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్కులగూడ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జెట్ట రమేశ్, ఉపాధ్యక్షుడిగా కుమార్, కార్యదర్శిగా మోష, చాకలిగుట్టతండా అధ్యక్షుడిగా పాత్లవత్ కిషన్‌నాయక్, ఉపాధ్యక్షుడిగా రవినాయక్, కార్యదర్శిగా లక్ష్మణ్, శ్రీనివాసులగూడ అధ్యక్షుడిగా రాజిరెడ్డి, ఉపాధ్యాక్షుడిగా రాంచెంద్రయ్య, కార్యదర్శిగా జగన్, ఇతర కమిటీ సభ్యులను ఎన్నికల ఇన్చార్జిలు యాదగిరి, రాజవరప్రసాద్, జంగయ్య, నవీన్, శ్రీనివాస్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్ కమిటీ సభ్యులకు నియామకపత్రాన్ని అందజేశారు.