ధారూరు, అక్టోబర్ 5: ధారూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పంచాయతీ, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతి నిధులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి ,మండల ప్రత్యేక అధికారి మల్లేశం జడ్పీటీసి కోస్నం సుజాత, వైస్ ఎంపీ పీ విజయ్‌కుమార్, తహసీల్ధార్ బీమయ్య గౌడ్, ఆర్ఐ చంద్రమోహన్, గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, ఉపసర్పంచ్ రాజేశ్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్‌కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజునాయక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వీరేశం, టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శులు కావలి అంజయ్య, నాయకులు నాయకులు లక్ష్మయ్య, రైతు బంధు అధ్యక్షుడు వెంకటయ్య, ఇస్మాయిల్, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో సర్పం చ్ చంద్రమ్మ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు.
తాండూరు రూరల్, అక్టోబర్ 5: తాండూరు మండలం కొత్లాపూర్ పంచాయతీ కార్యాలయంలో పలువురు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్య క్రమంంలో సర్పంచ్ సాయిలు, అధికారులు పాల్గొన్నారు.
దోమ, అక్టోబర్ 5 : దోమ మండల పరిధిలోని గుండాల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి జడ్పీటీసి నాగిరెడ్డి చీరలను పంపిణీ చేయగా, మండల పరిధిలోనికొత్తపల్లి, దాదాపూర్, మల్లేపల్లి, బట్లసందారం, దిర్సంపల్లి, బడెంపల్లి, గంజిపల్లి, రాకొండ, బుద్లాపూర్,కిష్టాపూర్, దిర్సంపల్లి తండా గ్రామాల్లో ఎంపీపీ అనసూయతో కలిసి జడ్పీటీసి నాగిరెడ్డి ఆయా గ్రామాల్లో చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, కోఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుభాష్‌నాయక్, డిప్యూటి తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కోట్‌పల్లి, అక్టోబర్5 : మండలంలోని కంకణాలపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను సర్పంచ్ చంద్రకళతో కలిసి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు.
కులకచర్ల, అక్టోబర్ 5 : కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మీ అధ్యక్షతన కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పులింగ విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు సారా శ్రీను, పెంటయ్య, వెంకటేశ్, శ్యామ్‌రావు, ఉపసర్పంచ్ చంద్రభూపాల్రావు గ్రామ మహిళలు పాల్గొన్నారు.
దౌల్తాబాద్, అక్టోబర్ 5: మండలంలోని బాలంపేట,గుండేపల్లి గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ చీరలను జడ్పీటీసీ కోట్ల మహిపాల్, సింగిల్ విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి అధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మధుసూదన్ రెడ్డి, పార్వతమ్మ, ఎంపీటీసీలు సున్నపు బసంతమ్మ, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.