కులకచర్ల, సెప్టెంబర్5: కుస్మసముద్రం చెరువుముందలి తం డాలో నాలుగు తండాలు కలిసి గ్రామ పంచాయతీగా ఏర్పా టుచేశారు. పంచాయతీలో 1100 జనాభా, 400 కుటుం బాలు ఉన్నాయి. కుస్మసముద్రం పంచాయతీకి అనుబంధం గా చెరువుముందలితండా ఉండేది. పంచాయతీగా ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం తో తండాల రూపురేఖలు మారిపోయాయి. చెరువు ముం దలి తండా(కె) నేడు ప్రగతి పథంలో పయనిస్తున్నది. పంచా యతీ పరిధిలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేశా రు. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో నాటి న మొక్కలు పెద్దవై, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లె ప్రగతి లో పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ సమ కూర్చుకు న్నారు. పంచాయతీ ట్రాక్టర్‌తో గ్రామంలోని ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కుల కచర్ల మండలంలో రెండు చెరువుముందలి తండాలు ఉన్నా యి. ఒకటి అంతారం పంచాయతీ పరిధిలో ఉన్న తండాను (ఎ) అని, రెండోది కుస్మసముద్రం పంచాయతీ పరిధిలో ఉన్నది చెరువుముందలితండా(కె)గా పిలుస్తున్నారు.
కుస్మసముద్రం గ్రామానికి అనుబంధంగా చెరువుముందలి తండా ఉండేది. చెరువుముందలితండా, నాగమ్మగడ్డతండా, జివ్విగడ్డతండా, అల్లుగడ్డతండాలను కలిపి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటుచేశారు. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి, గ్రా మాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నది. గ్రామీణ ప్రాం తాలకు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రగతి పథంలో పయ నించేలా చేస్తున్నది. డంపింగ్ యార్డులు, సీసీరోడ్లు, పారిశు ధ్యం పనుల నిర్వహణ, మట్టి రోడ్ల ఏర్పాటు, నర్సీల నిర్వ హణ, వీధి దీపాల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత వంటి పనులు నిర్వహిస్తున్నది. ఈ పంచాయతీలో100 శాతం మరుగుదొడ్లు నిర్మించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేం దుకు పంచాయతీ ట్రాక్టర్‌తో రోజూ చెత్త సేకరిస్తూ డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ప్రతి ఇంటికి చెత్త బుట్టలు పం పిణీ చేశారు. మురుగునీటి కాల్వలు నిర్మించారు. చెరువు ముందలి తండా(కె) సమీపంలో నిర్మించి వైకుంఠ ధామం నిర్మాణం పూర్తైంది. గ్రామంలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. చెరువుముందలితండాలో పంచాయతీ నిధులు రూ. 15 లక్షలతో సీసీ రోడ్లు వేయించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీటిని అందిస్తున్నారు. కుస్మసముద్రం నుంచి చెరువుముందలి తండాకు వెళ్లే రోడ్డు పక్కన ప్రమా దకరంగా పెద్ద బావి ఉండేది. పంచాయతీ నిధులతో ఈ బావిని కూల్చి వేశారు. దీంతో పాటు ఫార్మేషన్ రోడ్డు వెడ ల్పుగా వేయడంతో తండాలవాసుల కష్టాలు తప్పాయి.