కల్వకుర్తి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్పిత
కడ్తాల్, అక్టోబర్2: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కల్వకుర్తి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మారెంరెడ్డి అర్పిత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని రావిచేడ్, న్యామతాపూర్ గ్రామాల్లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల హక్కులు, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చట్టంపై ప్రజలకు వివరించారు. ప్రజలందరూ రాజీ మార్గంలోనే సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం సీనియర్ న్యాయవాది లక్ష్మణ్‌శర్మ మాట్లాడుతూ ప్రతి సమ స్య పరిష్కారానికి కోర్టుకు రావొద్దని, కోర్టు కేసులతో కాలయాపన జరుగుతుందని, పె ద్దల సమక్షంలోనే గ్రామంలోనే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం సీఐ ఉపేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ క్రైం కేసులు చాలా నమోదవుతున్నాయని, ఆన్లైన్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మక్తమాదారం గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో జడ్జి అర్పిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు సులోచన, భారతమ్మ, ఎంపీటీసీలు గోపాల్, మంజుల, ఉప సర్పంచ్‌లు వెంకటేశ్, గణేశ్, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, న్యాయవాదులు కృష్ణయ్య, భాస్కర్‌రెడ్డి, ఆంజనేయులు, శేఖర్, జయంత్‌కుమార్, రామకృష్ణ, కోర్టు సూపరింటెండెంట్ క్రాంతికిరణ్, నాయకులు సాయిలు, చంద్రమౌళి, నర్సింహ, విఠలయ్యగౌడ్, రంగయ్య, బాలకృష్ణ, రమేశ్, సాయికుమార్ పాల్గొన్నారు.
దివ్యాంగులు అధైర్యపడొద్దు
ఇబ్రహీంపట్నం, అక్టోబర్2: దివ్యాంగులు అధైర్యపడొద్దని మనోధైర్యంతో ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. శనివారం గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సూచనల మేరకు ఇబ్రహీంపట్నంసమీపంలోని అంధుల ఆశ్రమం లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. తాను విద్యార్థులను ఆదుకుంటాన ని పేర్కొన్నారు. అనంతరం సివిల్‌జడ్జి పద్మావతి మాట్లాడుతూ కృషి, పట్టుదల ముందు వైకల్యం నిలువదన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు అంజన్‌రెడ్డి, రవి, మురళి, రవికిరణ్, మహేందర్, నాగరాజు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్ చట్టంపై అవగాహన కల్పించాలి
పరిగి, అక్టోబర్2: సీనియర్ సిటిజన్ చట్టం పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని పరిగి జూనియర్ సివిల్ జడ్జి భారతి అన్నా రు. శనివారం పరిగి కోర్టులో పాన్ ఇండి యా అవెర్నెస్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్‌కు వారి హక్కులపై జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల పోషణకు కావాల్సిన సౌకర్యాలను వారి సంతానం కల్పించకపోతే వృద్ధు లు లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములుయాదవ్, గౌస్‌పాషా, బాలముకుందం, నర్సింహారావు, శ్రీనివాస్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, శివారెడ్డి, అలీం, వీరన్న, నారాయణ, పాపయ్య, నవాజ్‌రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.