తాండూరు, సెప్టెంబర్ 30: తాండూరు ప్రభుత్వ జిల్లా దవాఖానలో రోగు లకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న వైద్యులను పాపులేషన్ రీసర్చ్ సెం టర్ ప్రతినిధులు అభినందించారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్ఎంసీ నిధుల వినియోగం, ఆస్పత్రిలో సౌకర్యాలు, వైద్యుల పనితీరును పీఆర్సీ బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం నిర్వహిం చిన మీడియా సమావేశంలో పాపులేషన్ రీసర్చ్ సెంటర్ జాయింట్ డైరెక్టర్ శ్రీప్రసాద్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పరిశుభ్రత బాగుందన్నారు. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం అభినందనీయమన్నారు. ప్రైవేటులో రూ. వేల ఖర్చు అయ్యే వైద్యం ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆస్పత్రులకు ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటుందనే విషయాలపై రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హన్మకొండ ప్రభుత్వ ఆస్పతుల్లో పీఆర్సీ బృందం పరిశీలన చేస్తుందని తెలిపారు. ఇక్కడి పరిశీలన నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టేట్ ప్రోగ్రాం కోర్డినేటర్ జగన్నాథ్‌రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్ ఉన్నారు.
బొంరాస్‌పేట పీహెచ్‌సీని సందర్శించిన కేంద్రబృందం
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 30 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని కేంద్ర బృందం గురువారం సందర్శించింది. ఈ బృందానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) పరిశీలకుడు డాక్టర్ శ్రీకాంత్ నేతృత్వం వహించారు. ఎన్ఆర్హెచ్ఎం ద్వారా పీహెచ్‌సీకి మంజూరైన నిధులు నిబంధనల ప్రకారం వినియోగిస్తున్నారా లేదా, దవాఖానాలో రోగు లకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, రికార్డుల నిర్వహణ బాగుందా అనే విషయాలను శ్రీకాంత్ బృందం నిశితంగా పరిశీలించింది. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, క్షయ, కుష్టు వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్‌ను అడిగి తెలుసుకున్నారు. టీబీ, క్షయవ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు అవగాహన కల్పిస్తున్నామని మండల వైద్యాధికారి రవీంద్ర కేంద్ర బృందానికి వివరించారు. దవాఖానాలోని పలు రికార్డులను, పరిసరాలు, పచ్చదనాన్ని అధికారులు పరిశీలించి చాలా బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బురాన్పూర్లోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూడా సం దర్శించి క్షేత్రస్థాయిలో వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగులకు మరింత నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందిండానికి పీహెచ్‌సీకి అదనంగా ఒక డాక్టర్‌ను, ప్రతి ఏఎన్ఎంకు అదనంగా మరో ఏఎన్ఎంను నియ మించాలని, పీహెచ్‌సీకి వాహనాన్ని ఇవ్వాలని మండల వైద్యాధికారి రవీం ద్ర యాదవ్ కేంద్ర బృందాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సాయిబాబా, డీఎస్వో డాక్టర్ అరవింద్, దౌల్తాబాద్ మం డల వైద్యాధికారి రతన్‌లాల్, పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.