
కొణిజర్ల, జనవరి14 : తనికెళ్ల గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి సంబురాల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటూ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ చల్లా మోహన్‌రావు దంపతులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో బండారుపల్లి లక్ష్మణ్, చిరంజీవి,కిలారు మాధవరావు, ఎస్ కే మౌలానా, ఎర్రా రామారావు, వెంకటేశ్వరరావు, చల్లా నరసింహారావు, కొర్లకంటి రవి, సైదా, పోగుల శ్రీను, రంగారావు, ఎల్లయ్య, మిట్టపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్, జనవరి 14 : భోగి పండగ పర్వదినాన్ని శుక్రవారం సత్తుపల్లి, వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు జరుపుకున్నారు. కొత్తూరు రైతువేదిక వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావు పాల్గొని భోగిమంటలు వెలిగించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలను తిలకించారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతిని పురస్కరించుకుని ప్రజలు భోగి వేడుకల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో యువత భోగి మంటలు వేశారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబసభ్యులు ఇళ్లకు చేరుకున్నారు. ఉదయాన్నే చిన్నారులు కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. మహిళలు తమ ఇంటి ముందు వాకిళ్లలో రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పేర్చారు.గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గుంపెళ్లగూడెంలో నిర్వాహకులు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. – నెట్వర్క్