
ఖమ్మం, జనవరి 20 : ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన తాతా మధు గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లో శాసనమండలి ప్రొటెం స్పీకర్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ చాంబర్లో శాసనమండలి సభ్యుడిగా మధు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు, నాయకులకు రుణపడిఉంటానన్నారు. సబ్బండవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హత గల లబ్ధిదారులకు అందించే విధంగా కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతం కోసం పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యావతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, తెలంగాణ శాసన మండలి కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, హరిప్రియ నాయక్ తదితరులు తాతా మధుకు అభినందనలు తెలిపారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కుసుమ జగదీశ్, కుమారి అంగోత్బిందు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గాయత్రి రవి, ఆర్జేసీ కృష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా, తాతా మధు ఎమ్మెల్సీగా తొలిసారిగా ఎన్నికై శాసన మండలిలో అడుగుపెట్టారు.