Theft on phc | ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు పడ్డారు

చార్మినార్ : ఇండ్లల్లో చోరీలు చేస్తే రొటీన్ అనుకున్నారో లేదా కరోనా కేసులు ప్రబలుతున్న సమయంలో రక్షణ కోసమని భావించారో గాని పాతనగరంలోని ఓ పీహెచ్సీలో దూరిన దొంగలు కరోనా టీకాల బాటిళ్లను ఎత్తుకెళ్లారు. మీర్ చౌక్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలికబర్ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొనసాగుతుంది.
శనివారం విధులు ముగించుకుని తాళం వేసి వెళ్లిన ఆసుపత్రి సిబ్బంది సోమవారం తిరిగి విధులకు వచ్చే సరికి పీహెచ్సీ కేంద్ర తలుపులు తెరిచి, తాళం విరిగిపడి ఉన్న విషయాన్ని గుర్తించారు. కేంద్రంలోకి వెళ్లి చూడగా చికిత్సల కోసం వచ్చే వారి వివరాలను నమోదు చేసే కంప్యూటర్ మానిటర్లతోపాటు రెండు సీపీయూలు కీబోర్డులు ధ్వంసమై ఉన్నాయి.

ఆసుపత్రిలో భద్రపర్చిన కొవాగ్జిన్ 17 వయల్స్ కోవిషీల్డ్ 27 వయల్స్లను దొంగలు ఎత్తుకెళ్లారని గుర్తించారు. ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన టీవిని ధ్వంసం చేసిన దొంగలు బీసీజీ 22, ఓపివి 44, డీపీటీ 15, ఐపీవీ7, హెపాటీబీ 39, ఎంఆర్ 38, పీసీపీ 7, పెంటా 23, డీటీ 21, ఏఈఎఫ్పై 2 కిట్లను కూడా చోరులు అపహరించారు.
చోరీ జరిగిన విషయాన్ని ఆసుపత్రి వైద్యులు లింగమూర్తి మీర్ చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించామని ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

