
సత్తుపల్లి, జనవరి 12 : నేటి యువత స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. జేవీఆర్ పార్కు ఎదురుగా ఉన్న వివేకానందుని కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. సామాజిక సేవల్లో పాలుపంచుకుంటున్న పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ సుజాత, పలు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు అజార్, రాజు, ప్రవీణ్‌కుమార్, రాధాకృష్ణ, నిహాల్, చిత్తలూరి ప్రసాద్, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, దారా ఏసురత్నం, గాదె నర్సింహారావు, చల్లగుండ్ల అప్పారావు, భాషావలీ, ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, జనవరి 12: మండల కేంద్రం తో పాటు కారేపల్లి క్రాస్‌రోడ్‌లో వివేకానందుడి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కల్తి రాం ప్రసాద్, భూక్యా సుజాత, చింతల శివకృష్ణ, మేకల మల్లేశ్, ధరావత్ వినోద్, పూనెం రాజు తదితరులు పాల్గొన్నారు.
వైరా, జనవరి 12 : గొల్లపూడిలో వివేకానంద విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ కాపా మురళి, ప్రభాకర్, రాంబాబు, శ్రీకాంత్, సూర్యప్రకాశ్, శ్రీనివాసరావు, సత్యసాయి, వెంకయ్య పాల్గొన్నారు.
తల్లాడ, జనవరి12 : లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు పులబాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాలభారతి విద్యాలయంలో స్వామివివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కర్నాటి లక్ష్మారెడ్డి, నంబూరి మోహన్, వెంకటేశ్వరరావు, కనకదుర్గప్రసాద్, అనుమోలు సర్వేశ్వరరావు, మిట్టపల్లి కృష్ణ, వేమిశెట్టి సంతోశ్, గుంటుపల్లి వెంకటేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. అంజనాపురంలో స్వామివివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. కేతినేని విద్యాసాగర్, ప్రభాకర్‌రావు, శ్రీను, కోటేశ్వరరావు, బేబీరాణి తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి, జనవరి 12 : స్వామి వివేకానంద విగ్రహానికి ఎస్సై సాయిభార్గవి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పేరసాని సందీప్, కొమ్మినేని భద్రయ్య, జాలె శ్రీను, పోలూరి రామచంద్రయ్య, భూక్యా శ్రీనునాయక్, భాగం రంగారావు తదితరులు పాల్గొన్నారు.