Corona and omicron | కరోనా..ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు : ఎమ్మెల్యే ముఠా గోపాల్

కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడ మారుతీనగర్‌లో డీబీఆర్ మిల్స్ యూపీహెచ్సీ కేంద్రంలో కరోనాను నియంత్రించేందుకు 15 నుండి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్, బూస్టర్ వ్యాక్సిన్‌ను ఆయన వైద్యాధికారి డాక్టర్ రవికుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడూతూ కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపద్యంలో 15 నుండి 18 ఏండ్లలోపు పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని ఆయన అన్నారు. తీవ్రమైన జలుబు, తలనొప్పి, జ్వరం ఉన్నట్లైతే వెంటనే సంబంధిత యూపీహెచ్‌సీలలో వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని అన్నారు. ఈ విషయమై వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వల్లాల శ్యామ్యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, రామేశ్వరం రాజేశ్, జే. శ్రీహరి, సాయి, యూపీహెచ్సీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

