జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 దాటితే భానుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా చౌటుప్పల్‌లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మూడ్రోజులుగా వరుసగా 41.7, 41.9, 41.9 డిగ్రీలు నమోదయ్యాయి. అదేవిధంగా బొమ్మలరామారంలో 40.3,సంస్థానారాయణపురంలో 40.9, యాదగిరిగుట్ట లో 41.6, పోచంపల్లిలో 40.8, వలిగొండలో 40.3, బీబీనగర్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు పెరిగిపోవడంతో ప్రజలు శీతల పానీయాలు తాగి ఉపశమనం పొందుతున్నారు.
ఎండలో తిరగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంటుంది. ఈ క్రమంలో శరీరంలోని నీటిశాతం తగ్గుతుంది. సబ్జా నీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి బోండాలు వంటివి తీసుకోవాలి. ఎండలో తిరిగొచ్చి ఫ్రిడ్జిలో నీరు, కూల్‌డ్రింక్స్ తాగొద్దు. కుండలో నీటిని సేవించాలి. రోజుకు కనీసం 4 లీటర్ల వరకు నీటిని విడుతల వారీగా తీసుకోవాలి.
– విద్యారాణి, ప్రకృతి వైద్యురాలు, చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం : చిన్నకొండూర్, చౌటుప్పల్, లింగోజిగూడెం, పంతంగి, నేలపట్ల, తాళ్ల సింగారం, స్వామివారి లింగోటం, తంగేడుపల్లి
వలిగొండ : వర్కట్‌పల్లి, గోకారం, ప్రొద్దుటూర్, వలిగొండ, సంగెం, పహిల్వాన్పూర్, కంచనపల్లి, టేకుల సోమారం, రెడ్లరేపాక
భువనగిరి : రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికల్‌పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్‌నగర్, ఎర్రంబల్లె, నందనం
యాదగిరిగుట్ట : మల్లాపూర్, దతారుపల్లి, తుర్కపల్లి : గంధమళ్ల, వీరారెడ్డి పల్లి, కోనాపురం, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లి,
వేల్పుపల్లి